పెద‌కూర‌పాడు.. పెద్ద‌టాపిక్కే బాస్‌!!

Update: 2023-03-05 07:00 GMT
ఉమ్మ‌డి గుంటూరుజిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం పెద్ద‌కూర‌పాడు. క‌మ్మ సామాజికవ‌ర్గం - రెడ్డి సామాజిక వ‌ర్గం డామినేష‌న్ ఎక్కువ‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల‌కు ముందు 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. క‌మ్మ వ‌ర్గానికి చెందిన కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ విజ‌యం సాధించారు. దీనికి ముందు.. కాపు నాయ‌కుడు, ప్ర‌స్తుతం టీడీపీలోకి వ‌చ్చిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌రుస‌గా 5 సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. రోజులు అన్నీ ఒకేలా ఉండ‌వ‌న్న‌ట్టుగా పెదకూర‌పాడు రాజ‌కీయాలు కూడా అలానే మారిపోయా యి. 2024 ఎన్నిక‌ల్లో ఇక్కడ పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. వైసీపీ ఇక్క‌డ ఉన్న నంబూరు శంక‌ర‌రావును మార్చేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈయ‌న కూడా క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నా.. ఇప్పుడు మాత్రం వ్య‌తిరేక సెగ‌ను ఎదుర్కొంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను అక్క‌డ నుంచి మార్చి.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని ఇక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని భావిస్తోంది. ఇక‌, ఇటీవ‌ల ఇక్క‌డ చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు కూడా దీనికి మ‌ద్ద‌తుగా ఉన్నాయి. ఆళ్ల సోద‌రుడు.. అయోధ్య‌రామిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న‌కు రెండే నియోజ‌క‌వ‌ర్గాలు(అర్జ‌నుడికి.. ప‌క్షిక‌న్ను మాత్ర‌మే క‌నిపించిన‌ట్టు) క‌నిపిస్తున్నాయి.

ఒక‌టి మంగ‌ళ‌గిరి, రెండు పెద‌కూర‌పాడు. దీంతో కోట్ల‌రూపాయ‌ల‌తో ఈ రెండు చోట్లా(ఎంపీ నిధులు) అభివృద్ధి ప‌నులు చేస్తున్నారు. దీంతో ఆళ్లకు గ్యారెంటీగా ఈ టికెట్‌ను ఇస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌రోవైపు.. టీడీపీ నుంచి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఇక్కడి టికెట్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచా రం. ఇదే జ‌రిగితే.. పెదకూర‌పాడు లో పెద్ద ఎత్తున పోటీ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News