పెగాసస్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మెడకు చుట్టుకున్న ఈ నిఘా సాఫ్ట్ వేర్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక విచారణ జరుపుతోంది. పెగాసస్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు కాగా.. మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెగాసస్ పై చర్చ జరుగుతుండడాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
పిటీషనర్లలో ఒకరైన సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుతున్న విషయాన్ని సీనియర్ లాయర్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియా వేదికా సమాంతర చర్చ జరగడం ఏంటి? ఇది దురదృష్టకరమని’ ఎన్వీ రమణ అన్నారు. చర్చలకు మేం వ్యతిరేకం కాదు అని.. కానీ కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఇక్కడే విచారణ జరగాలన్నారు.
కోర్టుల్లో విచారణలపై పూర్తి ఉంచాలని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఏం చెప్పాలనుకున్నా కోర్టులోనే చెప్పాలని.. అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని.. సోషల్ మీడియా, బయటి చర్చలకు పరిధి ఉండాలని.. సోషల్ మీడియాలో సమాంతర చర్చలు జరపకూడదని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
ఇక న్యాయవాదులు దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పిటీషనర్లు పరిధి దాటకుండా చూస్తామన్నారు. సోషల్ మీడియాలో చర్చలకు అవకాశం లేదన్నారు. ప్రభుత్వం నుంచి తనకు మరిన్ని సూచనలు రావాల్సి ఉందని.. వాదనకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీంతో న్యాయస్థానం అంగీకరించి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.