‘సుఖం వస్తే ముఖం కడగడానికి తీరదట’.. ప్రధాని నరేంద్రమోడీ లాంటి దేశపు పెద్దమనిషి పద్ధతిగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి ప్రజలకు సైతం ఇబ్బందులు కలుగకుండా ఉదయం 6 గంటలకే వెళ్లి క్యూలో నిలబడి తన వంతు వచ్చాక వ్యాక్సిన్ వేసుకున్నాడు. దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తి అయిన మోడీ ఇంత నిబద్ధతగా.. నిక్కచ్చగా.. నిజాయితీ మెలిగాడు. కానీ మన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ సైతం ఒక మారుమూల పీహెచ్.సీకి స్వయంగా వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సీఎం కంటే తామే తోపులు అనుకున్నారేమో కానీ ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఏకంగా ఇళ్లకు వైద్య సిబ్బందిని రప్పించుకొని రాజాలా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
ఏపీలోని అధికార వైసీపీలోని కొందరు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు తామే రాజులం-మంత్రులం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణ చంద్రప్రసాద్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఇళ్ల వద్దే కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం పెనుదుమారం రేపింది. వైద్య సిబ్బంది స్వామి భక్తి చూపించారా? లేక ఎమ్మెల్యేలు ఇంటివద్దకు రమ్మని వ్యాక్సిన్ వేయించారో తెలియదు కానీ ఈ చర్య విమర్శల పాలైంది.దీనిపై సీరియస్ అయిన తూ.గో కలెక్టర్ మురళీధర్ రెడ్డి తాజాగా విచారణకు ఆదేశించారు. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను స్పష్టం చేశారు.
అటు గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పార్టీ ఆఫీసులో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం దుమారం రేపింది. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇలా పీఎం మోడీ, సీఎం జగన్ లను మించి వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. దీనిపై అధికార వైసీపీ పార్టీ స్పందిస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి.