వైసీపీ అలా.. టీడీపీ ఇలా.. ప్ర‌జ‌లు ఏం చేస్తారో!!

Update: 2022-08-01 04:15 GMT
ఏపీ ప్ర‌జ‌ల‌కు.. పెద్ద సంక‌ట‌మే వ‌చ్చింది. ఒక్క ప్ర‌జ‌ల‌కే కాదు.. రాజ‌కీయ పార్టీల‌కు  కూడా ఇది పెద్ద త‌ల నొప్పిగా ప‌రిణ‌మిం చింది. అదే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ నినాదంతో మ‌నం ముందుకు సాగాలి?  ఎలా ముందు కు వెళ్లాలి? అనే విష‌యంలో రాజ‌కీయ పార్టీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా అభివృద్ధికి ఓటేద్దామా?  సంక్షేమానికి మ‌ద్ద‌తిద్దామా? అనే డైల‌మాలో ఉన్న‌ట్టు ప‌రిస్థితులు అర్ధ‌మవుతున్నాయి.  దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు ప్ర‌ధాన నినాదాలే.

అధికార వైసీపీని తీసుకుంటే. సంక్షేమం పేరుతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు.. అర్హులైన ల‌బ్ధిదారుల‌కు.. పెద్ద ఎత్తున సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న విష‌యం తెలి సిందే. ఈ క్ర‌మంలోనే అప్పులు చేయాల్సి వ‌చ్చినా స‌ర్కారు ఎక్క‌డా వెర‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా ల‌బ్ధిదారుల‌కు సంక్షేమ ఫ‌లాల అజెండాతోనే వైసీపీ ముందుకు సాగాల‌ని నిర్ణ‌యిం చింది. ఈ వ్యూహ‌మే త‌మ‌కు మేలు చేస్తుంద‌ని.. వైసీపీ భావిస్తోంది.

ఈ క్ర‌మంలోనే అమ్మ ఒడి, నేత‌న్న నేస్తం, రైతు భ‌రోసా.. విద్యాదీవెన‌.. ఇలాంటి ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసు కువెళ్లి.. గ‌తంలో అమ‌లు కాని.. ఇలాంటి ప‌థ‌కాల‌ను తాము అమ‌లు చేశామ‌ని.. దీనివ‌ల్ల పేద‌ల ఇళ్ల‌లో వెలుగులు విర‌బూస్తున్నాయ‌ని.. వైసీపీ చెప్పుకొనేందుకు ప్లాన్ చేసింది. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు వైసీపీ ఈ వ్యూహాన్నే అమ‌లు చేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌, ఈ స‌మ‌యంలో అభివృద్ధి విష‌యాన్ని త‌క్కువ‌గా ప్ర‌స్తావించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అభివృద్ధి అజెండాను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నుంది. సంక్షేమం క‌న్నా.. అభి వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్న టీడీపీ.. ఆదిశ‌గా ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. రాజ‌ధాని అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టు, వెనుక బ‌డిన జిల్లాల అభివృద్ధి ఇలా..అ నేక అంశాల‌ను టీడీపీ ప్ర‌స్తావించ‌నుంది. అంటే.. అటు వైసీపీ సంక్షేమాన్ని, ఇటు టీడీపీ అభివృద్దిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువె ళ్లనున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జలు ఎవ‌రిని కోరుకుంటారు?  ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో 55 శాతం మంది మ‌హిళ‌లు.. త‌మ‌కు సంక్షేమం అందితే చాల‌ని అనుకుంటున్నారు. ఇక‌, పురుష ఓటు బ్యాంకుకు వ‌చ్చేస‌రికి మాత్రం మిశ్ర‌మ స్పంద‌న ఉంది. జ‌గ‌న్‌ను కాదంటున్నా.. టీడీపీ విష‌యంలో నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నారు.

ఫ‌లితంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి అనే రెండు విష‌యాలు కూడా కీల‌క రోల్ పోషించ‌నున్నాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి జ‌నం నాడి ఎలా ఉంటుందో చూడాలి. ఇదే విష‌యం రెండు పార్టీల్లోనూ... ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News