కరోనా భయంతో కొందరు చేస్తున్న చేష్టలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కరోనా విషయంలో ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రతతో పాటు.. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనిస్తూ.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అందుకు భిన్నంగా ఎదుటి వ్యక్తి వచ్చినవెంటనే.. వారిపై రసాయనాలు చల్లటం.. పొడులు చల్లేస్తున్న తీరు దక్షిణాదితో పోలిస్తే.. ఉత్తరాదిలో ఎక్కువగా కనిపిస్తుంది. మేం చేస్తున్నదంతా మీ మంచికే అంటూ పలువురు చేస్తున్న చేష్టలు ఏ మాత్రం స్వాగతించలేనివిగా కేంద్రం స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా.. ఎవరైనా కొత్తవారు వస్తే.. వారిపైన సోడియం హైపోక్లోరైట్ స్ప్రేను చేయటం ఈ మధ్య ఎక్కువైంది. ఈ చర్యను అడ్డుకునే వారితో.. ఇదంతా మీ మంచికోసమేగా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. ఈ తీరును పలువురు అనాగరిక చర్యగా అభివర్ణిస్తున్నారు. రసాయనాలు.. పొడులు.. పురుగు మందులు.. స్ప్రేలను వ్యక్తులపైన కానీ.. గ్రూపుల పైనా చల్లటానికి వీల్లేదు.
ఈ మధ్యన ఉత్తరాదిలో పెద్ద ఎత్తున గుమిగూడిన వలస కార్మికుల విషయంలోనూ ప్రభుత్వ అధికారులు ఇదే తీరులో వ్యవహరించిన వైనం మీడియాలో వచ్చింది. ఈ తీరును తీవ్రంగా తప్పు పడుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఎవరిపైనైనా ఇలా మందులు.. స్ప్రేలు చల్లితే వారి ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు.
ఇలాంటి చర్యలతో వైరస్ చస్తుందా? బతుకుతుందా? అన్నది పక్కన పెడితే.. ఈ చర్య సబబు కాదని చెబుతున్నారు. ఇలాంటి స్ప్రేల కారణంగా కరోనా చనిపోతుందనే దానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు.. పరిసరాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం.. భౌతికదూరాన్ని పాటించటం.. చేతులకు గ్లోవ్స్ వేసుకోవటం లాంటివి మంచిదంటున్నారు. ఇందుకు భిన్నంగా పొడులు.. రసాయనాలు చల్లితే మాత్రం పాండెమిక్ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.