తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముందుకు కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న మాస్టారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుంటున్న వర్గాల నుంచే ఇరకాటం మొదలైంది. అయితే ఇది విధానాల ప్రాతిపదికన కాకుండా కులం కోణంలో కావడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా వచ్చిన ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ - మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి తమ ఒకనాటి మాస్టారును సూటిగా నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కోదండరాం మాదిగల అభ్యున్నతి కోసం ఎందుకు ఉద్యమించరని పిడమర్తి ప్రశ్నించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో మాదిగ జేఏసీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరైన రవి మాట్లాడుతూ మల్లన్నసాగర్ పూర్తయితే 10 వేల మంది మాదిగల బతుకులు బాగుపడే అవకాశం ఉన్నదని, కోదండరాం మాత్రం ప్రాజెక్టుకు అడ్డుపడుతూ మాదిగల అభివృద్ధికి ఆటంకం కలిగించడం ఎంత వరకు సమంజసమన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయిస్తానన్న మందకృష్ణ.. ఇప్పటి వరకు ఏపీలో ఎందుకు తీర్మానం చేయించలేదని పిడమర్తి రవి ప్రశ్నించారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ - బీజేపీకి ఓటెయ్యాలని ప్రచారం చేసిన మందకృష్ణ - వర్గీకరణపై ప్రధానిని ఎందుకు కలువలేదని పిడమర్తి రవి నిలదీశారు. మాదిగజాతిని ఇతర పార్టీలకు వద్ద తాకట్టు పెట్టడమే మందకృష్ణ నైజమని - మాదిగల కోసం పోరాడే నేతనే గుర్తించాలని పిలుపునిచ్చారు. 2001లో ప్రారంభమైన మలి విడత తెలంగాణ ఉద్యమ ఫలితంగా 2014లో రాష్ట్రం సిద్ధించిందని, 1994 నుంచి కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటం ఫలించకపోవడం వెనుక నాయకత్వ లోపమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై వెంటనే ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసిఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సమర్పించడం అభినందనీయమని రవి అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/