అయోధ్యపై వ్యాఖ్యలు.. చిక్కుల్లో అసదుద్దీన్?

Update: 2020-08-09 03:57 GMT
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వీరేశ్ శాండిల్య ఈ పిల్ ను దాఖలు చేశారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంపై ఓవైసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ హాజరుపై ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని వ్యాఖ్యానించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండేదని.. ఉందని.. ఖచ్చితంగా ఉంటుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చరిత్రను ఎవరూ మార్చలేరంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.   రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓ వర్గం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజ్యాంగ విరుద్దం అంటూ గతంలో విమర్శించారు.

ఆ తర్వాత ఈనెల 30న ఓ చానెల్ డిబేట్ లో పాల్గొన్న అసదుద్దీన్ సుప్రీం కోర్టు పవిత్రతను - విజ్ఞతను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ పిటీషనర్ ఓ పిల్ దాఖలు చేశారు. దీనిపై త్వరలోనే సుప్రీంలో విచారణ జరుగనుంది.


Tags:    

Similar News