భారత్‌ లో మహమ్మారి సామాజిక వ్యాప్తి ప్రారంభమైంది!!

Update: 2020-07-18 07:15 GMT
దేశంలోనే తొలి వైరస్ కేసు నమోదైన కేరళలో ఆ వైరస్ కట్టడి చర్యలు సఫలమయ్యాయి. కఠిన చర్యలతో పాటు అన్ని ఆరోగ్య సదుపాయాలు కల్పించడంతో ఆ రాష్ట్రంలో వైరస్ అదుపులో ఉంది. కేసుల సంఖ్య చాలా వరకు తగ్గాయి. ఆ రాష్ట్రంలో తగ్గినా దేశవ్యాప్తంగా ఆ వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. ఈ వైరస్ వ్యాప్తిపై తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహమ్మారి వైరస్ సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని ప్రకటించారు.

దేశంలో కేసుల సంఖ్య పది లక్షలు దాటడం.. మృతుల 25 వేల మందికి పైగా ఉండడంతో పినరయి ఈ ప్రకటన చేశారు. దేశంలో తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి ఉంటే ఇంకా సామూహిక వ్యాప్తి ప్రారంభం కాలేదని భారత ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని ఖండించారు. అయితే భారత్‌ లో మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని తొలిసారిగా కేరళ ముఖ్యమంత్రి ప్రకటించడం సంచలనంగా మారింది.

దీనికి కారణాలు సీఎం పినరయి విజయన్ వివరించారు. కేరళలోని తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా, పూన్ తురా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వైరస్ సూపర్ స్పైడర్లు తయారయ్యారని, వారి ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందని పినరయి తెలిపారు. పుల్లువిలాలో 97 శాంపిల్స్ పరిశీలించగా, 51 మందికి, పూన్ తురాలో 50 శాంపిల్స్ పరీక్షించగా, 26 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు. దీంతో తిరువనంతపురంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

కేరళలో కొత్తగా 791 కొత్త కేసులు నమోదు కాగా వారిలో 532 మందికి సామూహిక వ్యాప్తి ద్వారా వైరస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. 42 మందికి వైరస్‌ ఎక్కడి నుంచి వైరస్‌ సోకిందో అధికారులకు తెలియడం లేదు. ఈ విషయాన్ని వెల్లడించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. తిరువనంతపురంలో వైరస్ కట్టడిలో భాగంగా జూలై నెల 6 నుంచి లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. సామూహిక వ్యాప్తి కనిపించిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
Tags:    

Similar News