కరోనా నివారణ చర్యలపై దేశంలోని పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (ఆగస్ట్ 11) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సీఎంలతో ఆయన మాట్లాడారు. దేశంలోని ఈ పది ప్రధాన రాష్ట్రాలు కరోనాను ఓడిస్తే ఈ వైరస్ పైన మన దేశం విజయం సాధిస్తుందన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీతో పాటు తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, యూపీలలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనాపై ప్రధాని మోడీ ఇప్పటికి ఏడుసార్లు సీఎంలతో చర్చించారు.
కరోనాపై పోరులో రాష్ట్రాలది కూడా ముఖ్యపాత్ర అన్నారు. కరోనాపై ప్రతి రాష్ట్రం పోరాడుతోందని, వ్యాధిని వ్యాప్తి చెందకుండా నిరోధించే విషయంలో రాష్ట్రాల పాత్ర కీలకం అన్నారు. మన దేశంలో రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోందని, సగటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకుంటున్న చర్యల వల్ల ఇది సాధ్యమవుతోందన్నారు. 72 గంటల్లో నిర్ధారణ అయితే వ్యాప్తిని వేగంగా నిరోధించవచ్చునని నిపుణులు చెబుతున్నారని, కాబట్టి కరోనా సోకిన వ్యక్తితో సంబంధాలు కలిగిన వ్యక్తులను 72 గంటల్లో పరీక్షించడం ఎంతో ముఖ్యమని చెప్పారు.
యూపీ, హర్యానా, ఢిల్లీలలో కరోనా ఆందోళనకర పరిస్థితులు కలిగించిందని, అమిత్ షా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసి, చర్యలు తీసుకున్నామని, దీంతో ఫలితాలు వచ్చాయని చెప్పారు. దేశంలో ఈ పది రాష్ట్రాలే అధిక జనసాంధ్రతను కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. తమకు పొరుగు రాష్ట్రాలలో ఉన్నట్లుగా మహా నగరాలు లేవని, భారీ మొలిక సదుపాయాలతో ఆసుపత్రులు లేవని, తమకు సహకరించాలని కోరారు.