ఇమ్రాన్‌ ఖాన్‌ కు మోడీ సందేశం

Update: 2019-03-23 13:18 GMT
లాహోర్‌ ఒప్పందం మార్చి 30న జరిగింది. అప్పటినుంచి మార్చి 30ని పాకిస్థాన్‌ జాతీయ దినోత్సవంలా జరుపుకుంటుంది పాకిస్తాన్‌. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కు సందేశం పంపించారు. రెండు దేశాల ప్రజలు స్వేచ్చగా బతకాలంటే ఉగ్రవాదాన్ని అంతమొందించాలని, అందుకోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనేది ఆ సందేశం సారాంశం.

ఎప్పుడైతే మోడీ ఈ సందేశం ఇమ్రాన్‌ ఖాన్‌ పంపించాడో అప్పుడు అది పాకిస్థాన్‌ లో వైరల్‌ అయ్యింది. దానికి కారణం.. ఇలా నాకు మోడీ ఒక సందేశం పంపించాడు అని ఇమ్రాన్‌ ఖాన్‌ లో తన ట్విట్టర్‌ పేజీలో పోస్ట్ చేయడమే దానికి కారణం. మోడీ పంపిన సందేశంపై ట్విట్టర్‌ లో స్పందించిన ఇమ్రాన్‌.. తాను కూడా అదే కోరుకుంటున్నట్లు చెప్పాడు. మరోవైపు.. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం పురస్కరించుకుని ఢిల్లీలో ఉన్న పాకిస్థాన్‌ హై కమిషనరేట్‌ లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి కొంతమంది అతిథుల్ని ఆహ్వానించారు. కానీ మనవాళ్లు హాజరుకాలేదు.
           
అయితే పాకిస్థాన్‌ జాతీయ మీడియా మాత్రం ఇమ్రాన్‌ ఖాన్‌ ని పరోక్షంగా హెచ్చరించింది. మోడీ పైకి కన్పించేంత సాఫ్ట్‌ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. జాతీయ దినోత్సవం సందర్భంగా మోడీ ఎవ్వరికీ తెలీకుండా మేసేజ్‌ పంపించారంటే దాని అర్థం.. మొన్నటి పుల్వామా ఘటనను మరోసారి గుర్తు చేసేందుకు అని హెచ్చరించారు. నిజంగా మోడీకి అలాంటి ఉద్దేశమే ఉంటే అందరికి తెలిసేలా మేసేజ్‌ పంపేవారని గుర్తుచేశారు. దీంతో.. ఒక్కసారిగా ఢిపెన్స్‌ లో పడ్డాడు ఇమ్రాన్‌ ఖాన్‌. మోడీ ముందు కుప్పిగంతులు వేస్తే అసలుకే మోసం వస్తుందని ఇమ్రాన్‌ ఖాన్‌ కు బాగా తెలుసుమరి.
Tags:    

Similar News