పోలింగ్ వేళ బాబు చేసిన పనే మోడీ చేశారే!

Update: 2019-05-12 05:37 GMT
భిన్న‌ధ్రువాలుగా చెప్పుకునే మోడీ.. చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు వేర్వేరుగా ఉన్నా.. వారి న‌డిచే మార్గం మాత్రం ఒకేలా ఉంటుందా?  ఒకేలాంటి ప‌రిస్థితులు ఇద్ద‌రికి ఎదురైతే.. వారిద్ద‌రి స్పంద‌న‌లు ఒకేమాదిరి ఉంటాయా? అన్న ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం చెప్పాలి. ఏప్రిల్ 11న ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ఏపీలో ఈసారి చంద్ర‌బాబుకు ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్న విష‌యం తెలిసిందే.

పోలింగ్ జ‌రిగిన ఏప్రిల్ 11న చంద్ర‌బాబు ట్వీట్ చేయ‌టం.. యూత్ పెద్ద ఎత్తున ఓటుహ‌క్కును వినియోగించుకోవాల‌ని కోర‌టం తెలిసిందే. స‌రిగ్గా అదే త‌ర‌హాలో తాజాగా ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేయ‌టం విశేషం. ఎందుకంటే.. ఈ రోజు పోలింగ్ జ‌రుగుతున్న ఏడు రాష్ట్రాల్లో మోడీ ప‌రివారానికి ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇలాంటివేళ‌.. పోలింగ్ స్టార్ట్ కావ‌టానికి ముందుగా ప్ర‌ధాని మోడీ ఓట‌ర్ల‌ను ఉద్దేశించి ట్విట్ట‌ర్ ద్వారా ఒక ట్వీట్ ను పోస్ట్ చేశారు.  

2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఈ రోజు మ‌రో ద‌శ పోలింగ్ జ‌రుగుతోంద‌ని.. ఆరోద‌శ పోలింగ్ జ‌రుగుతున్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఓట‌ర్లు బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ ఓటుహ‌క్కును వినియోగించాల‌ని తాను కోరుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ప్ర‌త్యేకించి యువ‌త రికార్డు స్థాయిలో ఓట‌హక్కు వినియోగించుకుంటార‌ని తాను ఆశిస్తున్న‌ట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ రోజు పోలింగ్ జ‌రుగుతున్న 59 స్థానాల్లో బీజేపీ ప్ర‌తికూల ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తున్న వేళ‌.. మోడీ ట్వీట్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.  ఇదే త‌ర‌హాలో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఎదుర్కొంటున్న చంద్ర‌బాబు సైతం పోలింగ్ వేళ‌.. ఇదే త‌ర‌హాలో ట్వీట్ చేసి.. ఓట‌ర్లంతా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల‌కు పోటెత్తాలంటూ పిలుపునిచ్చారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల వేళ‌.. మోడీ.. బాబుల ట్వీట్లు ఒకే ధోర‌ణిలో ఉండ‌టం విశేషం.
Tags:    

Similar News