పీఎంవో 'నాసిర‌కం' ఇంగ్లిష్

Update: 2018-02-08 16:52 GMT
'అమ్మ‌మ్మ‌ను తినేద్దాం..'' ఈ జోక్ తెలుసా మీకు? ఇంగ్లిష్‌లో 'కామా' ఇంపార్టెన్స్ చెప్పడానికి వాడే బెస్ట్ ఎగ్జాంపుల్స్ లో ఇదోటి. ''లెట్స్ ఈట్‌ - గ్రాండ్ మా'' (lets eat, grand ma- తిందాం ప‌దా అమ్మ‌మ్మా) * అనే వాక్యంలో కామా మిస్స‌య్యితే 'అమ్మ‌మ్మ‌ను తిందాం ప‌దా' అని అర్థం మారిపోతుంది. ఇలాంటి భారీ మిస్టేకే చేసింది పీఎంవో.

ఈరోజు పీఎంవో హెల్త్ ఇంపార్టెన్స్ గురించి ఒక ట్వీట్ చేసింది. మోడీ త‌ర‌ఫున ఆయ‌న ఆఫీసు చేసిన ఆ ట్వీట్ లో కామా మిస్ చేసి వాక్యం రాశారు. అది ఎలా ఉందంటే... Let us work together in providing the poor quality and affordable healthcare: pm modi. ఇందులో poor పక్క‌న కామా మిస్స‌య్యింది. కామా లేక‌పోవ‌డం వ‌ల్ల దాని అర్థం ఇలా మారిపోయింది... ''త‌క్క‌వ ధ‌ర‌లో నాసిర‌కం వైద్యం అందించ‌డానికి మ‌న‌మంద‌రం క‌లిసి ప‌ని చేద్దాం''. అస‌లే మోడీ వ్య‌తిరేకులు నెట్లో తెగ యాక్టివ్ క‌దా. వెంట‌నే దానిని ఆడేసుకున్నారు. రీట్వీట్లు చేసుకున్నారు. స్క్రీన్ షాట్లు దాచేసారు. అస‌లు కామా పెడితే ఆ మీనింగ్ ఎలా ఉంటుందంటే.... 'పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం - అందుబాటు ధ‌ర‌లో అందించ‌డానికి మ‌నంద‌రం కృషి చేద్దాం' అని వ‌స్తుంది. కేవ‌లం ఒక్క కామా వ‌ల్ల పీఎంవో ఆఫీసు ట్విట్ట‌రులో న‌వ్వుల పాల‌యింది. అయితే త‌ర్వాత ఇది స‌రిదిద్దార‌నుకోండి.

మిస్టేక్‌లు ఎవ‌రైనా చేస్తారు. కానీ దానిని జ‌నంలోకి పెట్టే ముందు ఒక‌సారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ట్వీట్ పెడుతున్న‌ది దేశాన్ని పాలించే ఆఫీసు. జాగ్ర‌త్త లేక‌పోతే అది అనేక అర్థాల‌కు దారితీస్తుంది.
Tags:    

Similar News