తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రూపొందించిన పథకానికి విశేష గుర్తింపు దక్కింది. ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రైతుబంధు పథకానికి ఇప్పటికే వివిధ రాష్ర్టాలు ఫిదా అవగా తాజాగా - ఐక్యరాజ్య సమితి అభినందించింది. ప్రపంచదేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను యూఎన్ వో ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు - రైతు బీమా పథకాలు స్థానం దక్కించుకున్నాయి. ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఐరాస తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపింది. ఈ నెల 21–23 తేదీల మధ్య ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ కేంద్ర కార్యాలయం రోమ్ నగరానికి రావాల్సిందిగా కోరింది. ఆ తేదీల్లో ఐరాస నిర్వహించే వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు ’అనే అంతర్జాతీయ సదస్సులో రైతుబంధు - రైతుబీమా పథకాలపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆయన ఈ నెల 20న రోమ్‌కు వెళ్లనున్నారు. ఆ 2 పథకాలకు సంబంధించి ఇప్పటికే ఐరాస పూర్తి సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి సేకరించింది. తక్కువ నిడివి గల రెండు ప్రత్యేక డాక్యుమెంటరీ చిత్రాలను కూడా ప్రభుత్వం ఐరాసకు పంపించింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతకు సీఎం కేసీఆర్ బంధువుగా నిలిచారు. పెట్టుబడి కోసం ఏ రైతు అప్పులు చేయకూడదన్న ఉద్దేశంతో..ఈ ఏడాది మే 10న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్ లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి 8 వేల చొప్పున రెండు విడతల్లో రైతులకు చెక్కులు అందజేశారు. మొత్తం 58.34 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వరంలా మారింది. ఆర్థిక సాయంతో వ్యవసాయం పండగలా మారింది. పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల వలసపోయిన రైతన్నలు..సొంతూరుకు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు.
అరుగాలం శ్రమించే రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే..ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. జూన్ 2 - 2018 నుంచి ప్రారంభమైన ఈ పథకం..అన్నదాత కుటుంబానికి భరోసాగా నిలిచింది. కుటుంబ పెద్ద మరణించి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వారికి 5 లక్షల రూపాయలతో వెలుగులు నింపింది. ఈ పథకం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. వ్యవసాయానికి, రైతన్న జీవితానికి అండగా నిలిచిన ఈ పథకాలు..ఇప్పుడు ప్రపంచంలో అద్భుత పథకాలుగా నిలిచాయి. రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్య రాజ్య సమితి గుర్తించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధికి ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ రెండు పథకాలు ఉండటం పట్ల సంతోషం వెలిబుచ్చారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవం అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి పోచారం ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికే కాదు.. ప్రపంచానికే ఆదర్శం అని మరోసారి నిరూపణ అయిందన్నారు.