టీఆర్ఎస్ నేతలు జారిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఒక్కరొక్కరూ స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ గాలాలకు చిక్కకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనతో బీజేపీలోకి వెళ్లాలనుకునే చాలా మంది ఆగిపోయారు.
ఇప్పటికే ఈటల రాజేందర్ వెళ్లడం.. ఆయనతో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉండడంతో అంతా గుంభనమైన వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో నివాళులర్పించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.
‘చావనైనా చస్తాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీడేది లేదని’ స్పస్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయాలనుకోవడం రాజ్యంగస్ఫూర్తికి విరుద్ధం అన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు.
పోచారం టీఆర్ఎస్ పై విశ్వాసాన్ని ప్రకటించగా.. ఇక జూపల్లి మాత్రం అవిశ్వాసం ప్రకటించారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారుతారని చాలా సార్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే నేటికి ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న ఆయన తాజాగా కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.
ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే టీఆర్ఎస్ ను వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గళమెత్తారు. ఊగిసలాటలో ఉన్నారు. ఇప్పుడు పోచారం పాజిటివ్ గా స్పందించగా.. ఇప్పుడు జూపల్లి వ్యతిరేకంగా మాట్లాడారు. మరి వీరి వాదనల నడుమ ఇంకా ఎంత మంది నోరెత్తుతారు? ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.