13 ఏళ్ల బాలికపై ఓ ఇన్‌స్పెక్టర్ అఘాయిత్యం !

Update: 2020-11-25 15:45 GMT
ఎన్ని చట్టాలు , ఎన్ని ప్రభుత్వాలు , ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా ఈ సమాజంలో మహిళల పై జరిగే అఘాయిత్యాలను ఆపలేకపోతున్నారు. ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ఆడపిల్లల పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో అన్యాయం జరిగిన వారికి మద్దతుగా నిలవాల్సిన పోలీసులు కూడా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే తమిళనాడులోని చెన్నైప్రాంతంలో జరిగింది. పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇన్‌ స్పెక్టర్‌ ను, ఓ బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ వ్యవహారం పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... షబీనా అనే మహిళ రెండు రోజుల క్రితం వాషర్ మెన్ పేట మహిళా పోలీసులను ఆశ్రయించింది. తన అక్క సమిత భానుతో పాటు కొంతమంది 13 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, ఆమె పై ప్రతి రోజూ లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బీజేపీ నాయకుడు రాజేంద్రన్ కూడా ఉన్నాడు. పోలీసులు బీజేపీ నేతపై ప్రత్యేక దృష్టి పెట్టి, లోతుగా విచారణ చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నూరు క్రైం డిపార్ట్‌మెంట్ ఇన్సెపెక్టర్ పుహలేంది, తాను కలిసి ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశామనే సంచలన నిజాన్ని బయటపెట్టాడు. దీంతో పుహలేందిపై మహిళా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో పుహలేంది బాలికను తీసుకొని రాజేంద్రన్ కార్యాలయానికి వెళ్లినట్లు ఆధారాలు లభించాయని మహిళా ఇన్‌స్పెక్టర్ ప్రియదర్శిని తెలిపారు. దీంతో ఇన్‌స్పెక్టర్ పుహలేందిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News