చిక్కుల్లో అచ్చెన్న‌..మండి ప‌డుతోన్న పోలీస్ సంఘాలు

Update: 2019-09-12 08:37 GMT
ప‌ల్నాడు సంఘ‌ట‌న సంద‌ర్భంగా పోలీసుల‌ను యూజ్లెస్ ఫెల్లోస్ అని దురుసుగా దూషించిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజార‌పు అచ్చెన్నాయుడు ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఓ ప్ర‌జాప్ర‌తినిధి అయిన అచ్చెన్నాయుడు పోలీసుల‌ను అగౌర‌వంగా మాట్లాడ‌టం ప‌ట్ల ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పోలీసుల‌ను దూషించ‌డం చ‌ట్ట‌రీత్యా నేర‌మ‌ని తెలిసినా న‌న్నేమి చేస్తార‌నే అహంకారంతో ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం ప‌ట్ల పోలీసు అధికార్ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం  చేస్తుంది.

ఇంత‌కు అచ్చెన్నాయుడు పోలీసుల‌ను ఎందుకు దూషించిన‌ట్లు.. ఇంత అహంకారం ఎందుకు అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. టీడీపీ ఛ‌లో అత్మ‌కూరు పిలునిచ్చిన సంద‌ర్భంగా ప‌ల్నాడుకు వెళ్ళుతున్న అచ్చెన్నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న పోలీసుల‌ను అచ్చెన్నాయుడు దూషించ‌డం, దౌర్జ‌న్యం చేయ‌డం చేశాడు. ఓ సంద‌ర్భంలో స‌హ‌నం కొల్పోయి పోలీసు అధికారుల‌ను యూజ్లెస్ ఫెలోస్ అంటూ దుర్భాష‌లాడాడు. ఏయ్ ఎగస్ట్రాలు చెయ్యొద్దు అంటూ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌పై అగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏయ్ ఎగస్ట్రాలు చెయ్యొద్దు , నన్ను ఆపే హక్కు నీకు ఎవడిచ్చాడు అంటూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో 144 సెక్షన్ గురించి ఓ ప్ర‌జాప్ర‌తినిధికి  తెలియకపోవడం సిగ్గు చేటని  పోలీసుల సంఘం మండిప‌డింది. ఓ మంత్రిగా ప‌నిచేసిన అచ్చెన్నాయుడుకు 144సెక్ష‌న్ తెలియ‌దా... అస‌లు ఓ పోలీసు అధికారిని దూషించ‌డం ఏంట‌ని ? పోలీసు అధికారుల సంఘం  రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీ‌నివాస‌రావు అగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.  అచ్చెన్నాయుడును గ‌తంలో పలు సందర్భాల్లో పోలీసులు కాపాడారని,  గత ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడినప్పుడు ప్రజలు అచ్చెన్నాయుడిని చితక్కొడుతుంటే కాపాడింది పోలీసులే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు శ్రీనివాసరావు.

ఓ సిఐ ఎంపీనో  - ఎమ్మెల్యేనో కాగలడు.. మీరు సిఐ కాగలరా అంటూ సీఐగా పనిచేసిన వ్య‌క్తి ఎంపీగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నాడ‌ని, కానీ మీరు మంత్రిగా చేసారు కానీ సీఐ కాగ‌ల‌రా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. మాజీ మంత్రి అచ్చెన్న తీరుపై డీజీపీకి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిన పోలీస్ అధికారుల సంఘం నేతలు ఒక్క అచ్చెన్నాయుడు మాత్రమే కాదు, ఏ నేత‌లైనా పోలీసులను అవమానించడం సమంజసం కాదని హితవు పలికారు.

    

Tags:    

Similar News