పోలీస్ బాస్ యూనిఫాం తీసేయండి సార్‌.. నెటిజ‌న్ల కామెంట్లు

Update: 2022-02-13 03:30 GMT
పై ఫొటో చూశారా? ఏపీ పోలీస్ బాస్‌, రాష్ట్ర డీజీపీ గౌతం స‌వాంగ్ యూనిఫాంలో ఉన్నారు. ఆయ‌న దాదాపు 4 ల‌క్ష‌ల మంది పైచిలుకు పోలీసుల‌కు బాస్‌. రాష్ట్రంలో కీల‌క ప‌ద‌వి. కేబినెట్ హోదా. పైగా.. కులాలు.. మ‌తాలు, ధ‌ర్మాల‌కు అతీతంగా.. కేవ‌లం రాజ్యాంగం ప్ర‌కారం చ‌ట్టాన్ని గౌర‌వించాల్సిన‌, అమ‌లు చేయాల్సిన పొజిష‌న్‌లో ఉన్నారు.

కానీ, ఆయ‌న చేసిన ప‌నికి.. నెటిజ‌న్లు నివ్వెర పోతున్నారు. ``బాస్ ఇలా.. చేయ‌డం త‌గునా?`` అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు.. `యూనిఫాం తీసేసి రావొచ్చు క‌దా!  మీ వ్య‌క్తిగత విష‌యాలైతే.. ఎలా గైనా చేసుకోవ‌చ్చుక‌దా!`` అంటున్నారు.

విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించిన డీజీపీ గౌతం స‌వాంగ్‌. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో భారీ ఎత్తున సాగ‌వుతున్న గంజాయిని ధ్వంసం చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దాదాపు 2 వేల ట‌న్నుల గంజాయిని ఆయ‌న పోలీసు అధికారుల‌తో క‌లిసి పెద్ద పెద్ద చావిళ్లు ఏర్పాటు చేసి ద‌హ‌నం చేశారు.

అంతకు ముందు డీజీపీ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అయితే.. ఈ సంద‌ర్భంగా డీజీపీ యూనిఫాంలో నేల‌పై కూర్చోవ‌డం.. స్వామితో సంభాషిస్తున్న ఫొటోలు.. వైర‌ల్ అయ్యాయి.

వీటిపై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. దేశంలో ఐపీఎస్ రూల్స్ ప్ర‌కారం.. ఒక మ‌తానికి, ఒక వ‌ర్గానికి పోలీసులు అనుమ‌తిం చ‌రాదు.అదేవిధంగా మ‌ఠాలు, ఆశ్ర‌మాలు, ఆల‌యాల‌కు వెళ్లినా.. అవి వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న‌లుగా మార్చుకోవాలి. లేదా విధులపై వెళ్లాలి. అంతేత‌ప్ప‌. ఒక ధ‌ర్మాన్ని లేదా.. ఒక మ‌తాన్ని ఆచ‌రించ‌డంలోను.. ప్రొత్స‌హించ‌డంలోనూ.. జొక్యం చేసుకోకూడ‌దు.

అన్ని మ‌తాలు, ధ‌ర్మాల‌ను స‌మానంగా చూడ‌డంతోపాటు రాజ్యాంగం చెప్పిన మేర‌కు వ్య‌వ‌హ‌రించాలి. కానీ, డీజీపీ త‌న ప‌ర్య‌ట‌న‌లో యూనిఫాంలో పాల్గొన్నారు. ఆయ‌న పాల్గొన్నందుకు ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ, విధుల్లో ఉండి ఇలా.. యూనిఫాంలో పాల్గొన‌డం.. నేల‌పై కూర్చోవ‌డ‌మే అభ్యంత‌రం. అంతేకాదు.. ఆయ‌న వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న పెట్టుకుని ఆశ్ర‌మంలోనే రెండు మూడు రోజులు గడిపినా ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండ‌ద‌ని.. కానీ.. యూనిఫాం ప్ర‌తిష్ట‌ను మాత్రం త‌గ్గించ‌వ‌ద్ద‌ని.. నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News