లాక్ డౌన్ తో మద్యంప్రియులు తీవ్ర అవస్థలు పడిన విషయం తెలిసిందే. తాజాగా మద్యం విక్రయాలకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో ప్రజలంతా మద్యం కోసం ఎగబడిన దృశ్యాలు చూసే ఉన్నాం. ఈ క్రమంలో మద్యం సీసా ముట్టుకోగానే కొందరు భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో సంతోషం పట్టలేక కొందరు నృత్యాలు కూడా చేశారు. ఇదే క్రమంలో ఓ పోలీస్ కూడా మద్యం చూడగానే తట్టుకోలేకపోయాడు. తన ఉద్యోగం పేరు చెప్పి మద్యం సీసాలు తీసుకుని తన స్నేహితులతో కలిసి తాగాడు. అయితే అతడు ఆ మద్యం కోసం ఒంటిపై ఉన్న డ్రెస్ ను కూడా పట్టించుకోకుండా స్నేహితులతో కలిసి తాగాడు. ఈ సంఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.
లాక్ డౌన్ అమలులో పోలీసుల పాత్ర కీలకంగా ఉంది. ఇన్నాళ్లు విధుల్లో ఒత్తిడి ఎదుర్కొన్న ఓ కానిస్టేబుల్ మద్యం దుకాణాలు తెరవడంతో వెంటనే స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలో లాక్ డౌన్ డ్యూటీ పక్కన పెట్టి ఏకంగా యూనీఫాంపైనే ఓ చెట్టు కింద కూర్చుని మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు - వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు.
అతడే కర్ణాటకలోని చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రాజు చౌహ్వాన్. లాక్ డౌన్ సందర్భంగా రాజు చౌహ్వాన్ భరమసాగర చెక్ పోస్టు వద్ద విధులు వేశారు. సోమవారం మద్యం దుకాణాలు ప్రారంభం కావడంతో సమీపంలోని మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. విధులు నిర్వహిస్తున్నట్టు నటించి వైన్ షాప్ లోకి వెళ్లాడు. లోపలికి వెళ్లిన అతడు తనకు అవసరమైన మందు బాటిల్స్ తీసుకుని బయటకు వచ్చాడు. అనంతరం చిత్రదుర్గ శివారు ప్రాంతంలో ఓ పొలంలో మిత్రులతో కలిసి మందు తాగుతూ ఎంజాయ్ చేశాడు. అయితే మందుమాయలో పడి యూనిఫాం విడవడం మరిపోయాడు. మందు తాగుతున్న సమయంలో మిత్రులు వీడియోలు - ఫొటోలు తీశారు. అవి కాస్త బయటకు వచ్చి అతడి ఉద్యోగానికి ఎసరు పెట్టాయి.