ఓ పిల్లాడు ఏడుస్తుంటే ఎవరైనా అయ్యో పాపం అంటారు.. వాడి కన్నీళ్ల వెనుక కారణమేంటని ఆరా తీస్తారు.. ఏ పిల్లాడు ఏడ్చినా ఎదుటి వారి మనసు కరగకమానదు.. అలాంటిది ఏకంగా పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకోవడం.. గ్యాప్ వస్తే ఆ పిల్లలతో అడుక్కుతినిపించడం చేస్తున్నారంటే వారిది ఎంత పెద్ద కర్కషత్వమో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దారుణమైన మనుషులు మన సమాజంలో ఉన్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందునా మహిళలే ఈ పనిచేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తల్లి ప్రేమను చాటే తల్లులే ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని తెలిసి పోలీసులు - సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ సంజు చమార్ ఇటీవల తన సొంత పట్టణం కాన్పూర్ వెళ్లడానికి తన కూతురు - కొడుకుతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చింది. పిల్లాడికి దాహం వేస్తుంటే నీళ్లు తేవడానికి ట్యాప్ వద్దకు వెళ్లింది. అప్పుడే ఓ మహిళ సంజుచమార్ కుమారుడిని చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఎత్తుకెళ్లిపోయింది. కుమారుడు కనిపించడం లేదని బాధిత మహిళ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు హైదరాబాద్ పోలీసుల సాయంతో వేట మొదలుపెట్టారు.
ఈ దర్యాప్తులో సీసీ కెమెరాలే పోలీసులకు ఎంతో ఉపయోగపడ్డాయి.పిల్లాడిని ఎత్తుకెళుతున్న మహిళను సీసీటీవీలో గమనించిన పోలీసులు ఆ మహిళ ఎక్కడెక్కడికి వెళ్లిందో గమనించారు. అయితే ఉదయం 7.24 గంటలకు సుచిత్ర బస్ స్టాప్ వద్ద 25ఎస్ బస్సు దిగుతున్నట్లు గుర్తించారు. ఆ కండక్టర్ ను ఆరాతీయగా ఆ దోపిడీ మహిళలు దొరికిపోయారు.
ఈ మొత్తం కేసులో సదురు దోపిడీ మహిళలు చేసిన పొరపాటు ఏదైనా ఉందంటే అది వారు వచ్చిన బస్ కండక్టర్ తో గొడవకు దిగడమే.. వారు అంబేద్కర్ నగర్ లో బస్సు ఎక్కి సికింద్రాబాద్ కు టికెట్ అడిగారు. అప్పుడే రూ.20 కదా రూ.30 తీసుకుంటున్నారని కండక్టర్ తో గొడవకు దిగారు. రేట్లు పెరిగాయని చెప్పినా వినలేదు. రూ.10 కోసం పడ్డ గొడవే పోలీసులకు వారికి పట్టించింది. సీసీ టీవీ ద్వారా మహిళ ఫొటోలను కండక్టర్ కు చూపడం.. వారు అంబేద్కర్ నగర్ వద్ద ఎక్కారని కండక్టర్ తెలుపడం జరిగిపోయింది. దీంతో పోలీసులు అంబేద్కర్ నగర్ లో గాలించగా సదురు దోపిడీ మహిళలు దొరికారు. ఈ కేేసులో ఆశ్చర్యకరంగా కిడ్నాప్ అయిన బాలుడితో మరో ఇద్దరు బాలలను కూడా వారి బారి నుంచి పోలీసులు విడిపించారు. ఆ ఇద్దరు చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నారని తెలిసింది. వారిద్దరిని అరెస్ట్ చేయగా.. ఆశ్రయమిచ్చిన మూడో మహిళ పారిపోయింది.
ఇంత పెద్ద కేసులో పోలీసులు స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సీసీ టీవీలు పోలీసులకు ఎంతగా ఉపయోగపడ్డాయో మాటల్లో చెప్పలేని పరిస్థితి. 10 రూపాయలకు కక్కుర్తి పడి కిడ్నాపర్లైన మహిళలు దొరికిపోవడం ఈ కేసులో అసలైన ట్విస్ట్..