ఏపీ రాజధాని వ్యవహారం పై తాజా పరిణామాలతో అమరావతిలో రైతులు మళ్లీ ఆందోళనలని తీవ్ర తరం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానుండటంతో మందడంలో రోడ్డు పై రైతులు - మహిళలు బైఠాయించారు.. నిన్నటి వరకు ప్రైవేట్ ప్రదేశాల్లో నిరసనలు - ధర్నాలు చేసిన రైతులు మళ్లీ రోడ్డెక్కారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో.. పోలీసులు రైతులకు ముందస్తుగా నోటీసులు ఇస్తున్నారు.
అమరావతి పరిరక్షణ జేఏసీ - విపక్షాలు ఛలో అసెంబ్లీ - జైల్ భరోకు పిలుపునివ్వడంతో నోటీసులు జారీ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశం రోజు ఆందోళనలకు అమనుతి లేదని, రాజధాని ప్రాంతం లోని 29 గ్రామాల రైతులు - పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 149 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు పంపించారు. అమరావతి ప్రాంతంలోని టీడీపీ నేతలకు - సీపీఐ సీనియర్ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుకు నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. శాంతిభద్రతలకు - ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరసనలు చేపట్టాలని ఆందోళనకారులకు పోలీసులు సూచించారు.
నోటీసుల్లో ప్రధానంగా ఆందోళనల చేపట్టడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగే ప్రమాదముందని.. ఒకవేళ గొడవలు జరిగితే ప్రాణనష్టం కూడా ఉండొచ్చన్నారు. రైతులు - నేతలు తమకు సహకరించాలని పోలీసులు కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున పలుపార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా - ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరసనలు చేపట్టాలని రాజధాని ప్రాంత గ్రామస్థులకు పోలీసులు సూచించారు.