ఒంగోలు జడ్పీలో మళ్లీ రగడ

Update: 2015-09-18 07:00 GMT
 ప్రకాశం జడ్పీ రాజకీయం మళ్లీ ముదురుతోంది. ఛైర్మన్‌ గా ఎన్నికై, కోర్టు ఉత్తర్వులతో పదవి కోల్పోయిన టీడీపీ సీనియర్‌ నాయకుడు ఈదల హరిబాబు ప్రకాశం జడ్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు మళ్లీ యత్నించారు.  శుక్రవారం ఆయన భారీ ర్యాలీతో ఒంగోలు జడ్పీ కార్యాలయానికి చేరుకుని... జడ్పీ  ఛాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, హరిబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులతోనే తాను ఛాంబర్‌ లోకి వెళ్తున్నానని పోలీసులతో వాదించినప్పటికీ, ఛాంబర్‌ లోకి వెళ్లేందుకు ఈదరను అనుమతించలేదు. దీంతో ఆయన వర్గీయులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ప్రకాశం జడ్పీ ఎన్నికల అనంతరం అనూహ్య పరిణామల మధ్య హరిబాబు జడ్పీ ఛైర్మన్ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి ఎన్నికైనా ఆయన వైసీపీ సహకారంతో పదవి అందుకోవడంతో టీడీపీ నేతలు కేసు వేశారు... కోర్టు తాత్కాలిక ఆదేశాలతో అప్పట్లో హరిబాబు పదవిపై అనిశ్చితి ఏర్పడడంతో బాలాజీ ఛైర్మన్ ఛాంబర్ లోకి వచ్చారు. అప్పటి నుంచి వివాదం నడుస్తోంది. తాజాగా హరిబాబు మళ్లీ జడ్పీకి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరగబోతోందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News