కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల నేపథ్యంలో ప్రజాప్రతినిధుల అక్రమార్జన - నేర చరిత్రపై తాజాగా అంతటా చర్చ జరుగుతోంది. ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి అభియోగాలను ఎదుర్కొంటున్నవారు అనేకమంది ఉన్నారని జనం చర్చించుకుంటున్నారు.. తెలంగాణలో గత ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 79 శాతం మాత్రమే ఆదాయ పన్ను పత్రాలు సమర్పించారు.. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా 675 మంది అభ్యర్థులలో 42 శాతం మంది - గెలుపొందిన వారిలో 94 మంది (79 శాతం) మాత్రమే ఆదాయ పన్ను పత్రాలు సమర్పించినట్టు ఎలక్షన్ వాచ్ అనే సంస్థ బయటపెట్టింది.
ఆర్థిక నేరాలు మాత్రమే కాకుండా పోటీ చేసిన అభ్యర్థులలో 288 మందిపై క్రిమినల్ కేసులు - 185 మందిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. గెలుపొందిన ఎమ్మెల్యేలలో 67 మందిపై క్రిమినల్ కేసులు - 46 మందిపై తీవ్రమైన నేరాల అభియోగాలున్నాయి. ఈ విషయం వారి అఫిడవిట్లలోనే ఉంది. ఆర్థిక నేరాలు - ఇతర క్రిమినల్ కేసుల విషయంలో ప్రజాప్రతినిధులు వందకు వందశాతం సుద్దపూసలు ఏమిలేరని - చాలా మటుకు ఏదో ఒక కేసులు నమోదు అయినవారే ఉన్నట్టు ఎలక్షన్ వాచ్ పేర్కొంది. గెలిచిన అభ్యర్థులలో మాత్రమే అత్యధికంగా కోటీశ్వర్లు ఉండటం గమనర్హం. పోటీ చేసిన అభ్యర్థులలో కోట్ల రూపాయాల ఆస్తులు కలిగిన వారిలో 388 మంది (24 శాతం) ఉండగా - గెలుపొందిన వారిలో 83 మంది (70 శాతం) కోటీశ్వర్లు ఉన్నట్టు పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధికంగా ఆస్తుల విలువ కలిగిన టాప్-10లో మొదటి స్థానంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రూ.111 కోట్ల ఆస్తులను అఫిడవిట్ లో పేర్కొన్నారు. రెండవ స్థానంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి (రూ.61 కోట్లు) - శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ (రూ.55 కోట్లు) - జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (రూ.42 కోట్లు) - తాండూరు ఎమ్మెల్యే - మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (రూ.37 కోట్లు) - గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ (రూ.36 కోట్లు) - నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ (రూ.29 కోట్లు) - జహీరాబాద్ ఎమ్మెల్యే - మాజీ మంత్రి గీతారెడ్డి (రూ.20 కోట్లు) ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ (రూ.19 కోట్లు) కలిగి ఉన్నట్టు ఎలక్షన్ వాచ్ పేర్కొంది. ఇలా ఉండగా ఎమ్మెల్యేల ఆస్తుల కంటే ముఖ్యమంత్రి కేసీఆర్ - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్తులు తక్కువగా ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తుల విలువ రూ.15 కోట్లు చూపించగా - ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఉన్నట్టు చూపారు. మెజార్టీ ప్రజా ప్రతినిధులు తిరిగే వాహనాల ఖరీదే 30 నుంచి 50 లక్షలు - వారి నివాస భవనాలు 2 నుంచి ఐదు - ఆరు కోట్ల విలువ చేస్తాయి. అయితే 80 శాతం మంది ప్రజాప్రతినిధులు తమ ఆస్తుల విలువను 10 నుంచి 15 కోట్లకు మించలేదని ఎన్నికల కమిషన్ కు చూపించడమంటే ఆదాయ పన్ను శాఖను మోసం చేసినట్లే అనుకోవాలి.