ఓటర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ పోలింగ్ ఏజెంట్ వారి ఓట్లను తానే వేయడం దుమారం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. తన ఓటును తాను వేసుకోలేకపోయానని.. సదురు ఏజెంట్ వేశాడంటూ ఓ మహిళా ఓటరు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆరోదశ పోలింగ్ సందర్భంగా హర్యాణాలో జరిగిన ఈ సంఘటన దుమారం రేపింది. ఈవీఎంలపై అవగాహన లేని ఓ మహిళ ఓటు వేయడానికి గందరగోళపడుతుంటే పోలింగ్ ఏజెంట్ వెళ్లి ఆమె ఓటును వేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గంలోని అసౌటి పోలింగ్ బూత్ లో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇలా ఒక మహిళ ఓటే కాదు.. ముగ్గురు మహిళల ఓట్లను పోలింగ్ ఏజెంటే వేయడం గమనార్హం. అయితే ఈ తతంగాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
కాగా ఫిర్యాదు రాగానే ఫరీదాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. సదురు పోలింగ్ ఏజెంట్ ను అరెస్ట్ చేయించారు. కేసు నమోదు చేశామని.. ముగ్గురు మహిళల ఓట్లు అతడే వేశాడని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ పై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.