ఐదో విడతలోనూ భారీగా పోలింగ్‌

Update: 2019-05-06 15:37 GMT
ఓటర్లు పోటెత్తారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఐదో విడత ఎన్నికలు జరిగాయి. మొత్తం 7 రాష్ట్రాల్లో ఎన్నికల్ని నిర్వహించారు. ఒకటి రెండు చోట్లా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఈసీ ప్రకటించింది. ఇక ఈ ఐదో విడతలో రాత్రి  7 గంటల వరకు 62.34 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది.

ఐదో విడత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ లో ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్‌ నమోదైంది. అలాగే చిన్న చిన్న గొడవలు కూడా బెంగాల్‌లోనే జరిగాయి. ఇక అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్‌లో పోలింగ్‌ శాతం నమోదైంది. జమ్మూలో రెండు పోలింగ్‌ సెంటర్లపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ దాడులు చేయడంతో.. ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక రాష్ట్రాల వారీగా రాత్రి 7 గంటలకు ఉన్న పోలింగ్ పర్సెంటేజ్‌ ను ఒక్కసారి పరిశీలిస్తే.. బీహార్‌ లో 57.76% - జమ్మూ కాశ్మీర్‌ లో 17.07% - మధ్యప్రదేశ్‌ లో 64.00% - రాజస్థాన్‌ లో రాజస్థాన్ 63.69% - ఉత్తరప్రదేశ్‌ లో 57.00% - పశ్చిమ బెంగాల్‌లో 74.32% - జార్ఖండ్‌ లో 64.58% ఓటింగ్‌ శాతం నమోదైంది.

 ఈసారి నిర్వహించిన ఐదో విడత ఎన్నికల్లో చాలామంది ప్రముఖులు బరిలో ఉన్నారు. రాహుల్‌ గాంధీ - రాజ్‌ నాథ్‌ సింగ్‌ - స్మృతి ఇరానీ - రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ - మాయావతి లాంటి ప్రముఖులు ఈ విడతలో బరిలోకి దిగడంతో పాటు ఉదయాన్నే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.   
Tags:    

Similar News