గులాబి గూటికి పొన్నాల‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

Update: 2016-03-06 05:28 GMT
తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు మ‌రో రాష్ర్ట స్థాయి నేత గులాబి గూటికి చేర‌నున్నారు. గ‌తంలో టీ పీసీసీ అధ్య‌క్షుడిగాను, ఉమ్మ‌డి రాష్ర్టానికి మంత్రిగాను ప‌ని చేసిన పొన్నాల ల‌క్ష్మ‌య్య 1989 - 1999 - 2004 - 2009 ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న టీఆర్ఎస్ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. పీసీసీ మాజీ అధ్య‌క్షుడు - ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ నాయ‌కుడిగా ఉన్న డీ శ్రీనివాస్‌ - రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు కేశ‌వ‌రావులు పొన్నాల‌ను టీఆర్ ఎస్‌ లో చేర్చేందుకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

టీఆర్ ఎస్‌ లో చేరితో త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇవ్వాల‌ని పొన్నాల కోర‌గా ఎమ్మెల్సీ ఆఫ‌ర్ ఇచ్చేందుకు టీఆర్ ఎస్ అధిష్టానం సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాగే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే త‌న కోడ‌లు పొన్నాల వైశాలికి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాల‌ని కండీష‌న్ పెట్టిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి మూడు నెల‌లుగానే పొన్నాల టీఆర్ ఎస్‌ లో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌గా అప్ప‌టి నుంచి చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని టీఆర్ ఎస్ ముఖ్యుడొక‌రు చెప్పారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత పొన్నాల గులాబీ కండువా కప్పుకోన్నుట్లు తెలిసింది.

 పొన్నాల కూడా టీఆర్ ఎస్‌ లో చేరిపోతే వ‌రంగ‌ల్ జిల్లాలో టీడీపీ - కాంగ్రెస్ ఆల్‌మోస్ట్ ఖాళీ అయిన‌ట్టే. ఇప్ప‌టికే ఈ రెండు పార్టీల‌కు చెందిన  ముఖ్య నేతలంతా ఇప్పటికే టీఆర్‌ ఎస్‌ లో చేరిపోయారు. అలాగే మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా త్వ‌ర‌లోనే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే ఖ‌మ్మం జిల్లాతో పాటు ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌ను టీఆర్ ఎస్‌ లో చేర్చుకోనున్న‌ట్టు తెలుస్తోంది.​
Tags:    

Similar News