బీజేపీ అంటే ఎందుకంత వ‌ణుకు కేసీఆర్‌?

Update: 2017-07-04 12:17 GMT
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రోమారు తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ - ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. త‌మ పార్టీ త‌ర‌ఫున నిల‌బెట్టిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి మీరాకుమార్‌ కు టీఆర్ ఎస్ ర‌థ‌సార‌థి కేసీఆర్ మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డం అదే స‌మ‌యంలో ఎన్డీఏ అభ్య‌ర్థి రామ్‌ నాథ్ కోవింద్‌ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి అట్ట‌హాసంగా స‌న్మానం ఏర్పాటు చేసిన‌ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు ఇద్ద‌రు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరును తూర్పార‌ప‌ట్టారు.

తెలంగాణ ఏర్పాటు స‌మ‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ దయతో తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ అదే సోనియా నిల‌బెపెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ కు ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని మాజీ ఎంపీ - కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్ ప్ర‌శ్నించారు. మీరా కుమార్‌ ఫోన్‌ చేసినప్ప‌టికీ స్పందించ‌క‌పోవ‌డాన్ని ఆయన తప్పుపట్టారు. కేసీఆర్‌ మీరా కుమార్‌ను అవమానించారని పొన్నం ప్ర‌భాక‌ర్ ఆరోపించారు. బీజేపీకి  కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థికి ఓటెందుకు వేస్తున్నారో ప్రజలు కేసీఆర్‌ను ప్రశ్నించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదానుసారం ఓటేస్తారో, పార్టీ తీరుపై తిరుగుబాటు చేస్తారో ఆలోచించుకోవాలని పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. తెలంగాణ సీఎం తీరును ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని పొన్నం చెప్పారు.

కేసీఆర్‌కు నీతి, నిజాయితీ లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ మండిప‌డ్డారు.  తెలంగాణ ఇస్తే తాను చప్రాసీగా పనిచేసి దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారని ఆయన విమర్శించారు. అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రప‌తి ప‌ద‌వికి నిల‌బెట్టిన ద‌ళిత మ‌హిళ మీరాకుమార్ ఫోన్‌ చేసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు బీజేపీ అంటే హ‌ఠాత్తుగా ఎందుకు అంత ప్రేమ పుట్టుకువ‌చ్చిందో చెప్పాల‌ని స‌ర్వే అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం కంటే త‌న ప్ర‌యోజ‌నాల‌కే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అందుకే బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని స‌ర్వే ఆరోపించారు.


Tags:    

Similar News