పెద్దనోట్లను రద్దు చేసి నెల దాటిపోయినప్పటికీ కరెన్సీ కష్టాలకు ఇంకా తెరపడలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు విమర్శల-ప్రతి స్పందనలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఈ పరిణామంపై మీడియాతో మాట్లాడుతూ నోట్ల సమస్యపై ప్రజల్లో అంతర్యుద్ధం (సివిల్ వార్) వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్లను రద్దు చేసి నెల రోజులు గడుస్తున్నా, ప్రజలకు ఉపశమనం కలిగించ లేకపోయారని విమర్శించారు.
‘సామాన్యులు తమ ఇంట్లో కీలక శుభకార్యాలైన పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు. బీజేపీ నేతలు మాత్రం వందల కోట్ల ఖర్చుతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు’ అని పొన్నం మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్లధనం గురించి మాట్లాడుతున్నారని, మరి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నల్లధనం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. స్వర్ణ భారతి ట్రస్ట్‌కు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల్లో నల్లధన కుబేరులు చాలా మంది ఉన్నారని అన్నారు. దేశ ప్రజలను మోదీ దొంగల్లా చూస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డూడూ బసవన్నలా వ్యవహరిస్తున్నారని పొన్నం అన్నారు.
ఇదిలాఉండగా.. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని బీజేపేఈ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అంగీకరించారు. కానీ దేశప్రయోజనాల కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు సమర్ధిస్తున్నారని చెప్పారు. దేశంలో నల్లధనాన్ని వెలికితీయడానికి కేంద్రం తాజాగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమం కేవలం ప్రారంభమేనని, దశాబ్దాలుగా అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని బయటకు తీసుకురావటానికి కేంద్రం భవిష్యత్తులో అనేక రకాల చర్యలు తీసుకుంటుందని మురళీధర్‌రావు వెల్లడించారు. ఏ ఇతర దేశాలలో పెద్దనోట్లను రద్దు చేసిన దాఖలాలు లేవని కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, కానీ ఇతర దేశాలలో కరెన్సీ ద్వారా లావాదేవీలు పెద్దమొత్తంలో జరగవని అన్నారు. భారతదేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 84శాతం వేయి, ఐదువందల నోట్లని, ఈ నోట్ల కారణంగా నల్లధనం పెరిగిపోవటానికి కారణమని చెబుతూ ఈ పాపానికి కారణం దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్‌దేనని మురళీధర్ రావు ఆరోపించారు.
పాకిస్థాన్ నుంచి భారీమొత్తంలో నకిలీ నోట్లు దేశంలోకి ప్రవేశపెడుతున్న కారణంగా ఆకస్మిక నిర్ణయం తప్పలేదని మురళీధర్ రావు చెప్పారు. ఇక భవిష్యత్తులో లావాదేవీలు అన్ని పూర్తిగా కరెన్సీతో జరపటం సాధ్యం కాదని, క్రమక్రమంగా డిజిటల్ లావాదేవీలకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. పెద్దనోట్ల ప్రభావం దేశ రాజకీయాలపై, ప్రభుత్వ వ్యవస్థపై చాలా పనిచేసిందని, ఈ నోట్ల రద్దుతో మార్పులు తథ్యమని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాలను ప్రభుత్వానికి సహకరిస్తున్న పేదలకు, వ్యవసాయ వర్గాలకు దక్కేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని మురళీధర్ రావు చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో ద్రవ్యోల్బణం దిగివస్తుందని, రియల్ ఎస్టేట్, బంగారం ధరలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పెద్దనోట్ల మార్పిడి, కొత్తనోట్ల చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు తేలితే నష్టపోయేది బ్యాంకు అధికారులు, సిబ్బందేనని అన్నారు.