నేనొక సాధారణ వ్యక్తిని. కారు ఈఎంఐ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ప్రజాసేవ కోసం విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశా. వీలు చిక్కినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పే మాటలివి. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా పదేపదే పలు బహిరంగ సభల్లో పవన్ చెప్పిన ఈ మాటలు విని జనాలకు కూడా బోర్ వచ్చేసింది.
అయితే - పవన్ పేదరికం కేవలం మాటల్లోనేనని తేల్చే వాస్తవం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పేదోడినని చెప్పుకునే పవన్ రూ.30 కోట్లతో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కొత్త ఇల్లు కట్టుకున్నట్లు ఈరోజు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9న గృహ ప్రవేశం కూడా జరిగిందని.. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సహా జనసేన అధినేత కుటుంబ సభ్యులంగా హాజరయ్యారని సమాచారం.
తానొక మామూలు కానిస్టేబుల్ కొడుకునని పవన్ పదేపదే చెప్తుంటారు. సినిమాల్లో వందల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశమున్నా.. దాన్ని కాదనుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని పలుమార్లు ఆయన చెప్పారు. ఇప్పటికీ తాను చాలా సాధారణ జీవితం గడుపుతున్నానని, విలాసాలకు తాను దూరమని పవన్ ఢంకా బజాయించారు. కారు ఈఎంఐ కట్టేందుకు, డ్రైవర్‌కు జీతం ఇచ్చేందుకు కూడా తన దగ్గర ఇప్పడు డబ్బులేదని పలుమార్లు పేర్కొన్నారు. జనసేన కూడా ప్రజల విరాళాలతోనే నడుస్తోందని చెప్పారు.
మరి అలాంటి పేద పవన్ కు ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టుకునేందుకు రూ.30 కోట్లు ఎలా వచ్చాయని ఈ వార్తలను చూసిన జనం పవన్‌ను ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు - వైసీపీ అధ్యక్షుడు జగన్ పై నిత్యం అవినీతి - అక్రమార్జన ఆరోపణలు చేసే పవన్.. తానొక్కడినే స్వచ్ఛమైన నాయకుణ్నని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి పేదోడినని చెప్పుకుంటూ రూ.30 కోట్లతో ఇల్లెలా కట్టావంటూ జనం అడిగే ప్రశ్నకు జనసేనాని ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే!