హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయొద్దు

Update: 2018-11-06 05:05 GMT
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తను హిందు వ్యతిరేకిగా ముద్రవేయాలని చూస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చారు. ఇటీవల ఆయన షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివెల్ లో పాల్గొని చాలా తార్కికంగా తెలివిగా మాట్లాడి విమర్శకుల నోళ్లు మూయించాడు. హిందూ వ్యతిరేక వ్యక్తిగా తనను చూస్తున్న వారికి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు.

శబరిమల ఆలయంలోకి మహిళలపై ప్రవేశంపై ఇటీవల ప్రకాష్ రాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు మహిళలను ఆలయంలోకి ప్రవేశించడానికి ఆదేశించినప్పటికీ చాలామంది భక్తులు ఈ ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు.  దీనిపై దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా షార్జా బుక్ ఫెస్టివెల్ లో ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై వివరణ ఇచ్చాడు. ‘కొందరు వ్యతిరేక వార్తల తోనే బతికే రోగిస్టులు తనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు.. అయ్యప్ప దేవుడే కాదు అని నేను అన్నట్టు.. నా పై ద్వేషాన్ని సృష్టించి - హిందూ వ్యతిరేకగా ముద్ర వేస్తున్నారని.. నిజానికి నేను అలా అనలేదని ’ వివరణ ఇచ్చారు.

‘స్త్రీలు - స్త్రీల సంప్రదాయాల గురించి తనను అడిగినప్పుడు వారిని దేవతగా కొలుస్తారని తాను అన్నానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. తల్లిగా - భూదేవిగా మహిళలను కొలుస్తూ గౌరవిస్తారని.. మహిళలను ఆరాధించే హక్కు భారత్ లో ఉందని .. అలాంటి స్త్రీలను ఆపే భక్తుడు భక్తుడే కాదు అని మాత్రమే అన్నానని తెలిపారు.

జస్ట్ ఆస్క్ ట్యాగ్ తో నెటిజన్లందరూ తనను హిందూ వ్యతిరేకిగా ముద్రవేస్తున్న వారికి తాను దేవుడిని కించపరచేలేదనే వ్యాఖ్యలను షేర్ చేసి బుద్ది చెప్పాలని ప్రకాష్ రాజ్ కోరారు.
Tags:    

Similar News