కేంద్ర లోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకోని వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. వెంటనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసన కారులు హోరెత్తిస్తున్నారు. ఈ ఆందోళనలో కొంతమంది నిరసన కారులు తమ ప్రాణాలని కూడా పోగొట్టుకున్నారు. తాజాగా ఈ ఎన్ ఆర్ సి అమలు పై కేంద్రం ఒక ప్రకటన చేసింది. అయితే , కేంద్రం చేసిన ఈ ప్రకటన ఒక వ్యూహాత్మకమే అని జేడీ(యూ) నేత ప్రశాంత్ కిషోర్ కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
దేశవ్యాప్తంగా ఎన్ ఆర్ సీ అమలుపై చర్చ ఉండదని ప్రభుత్వం చేసిన ప్రకటన పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబికిన నిరసనలను చల్లార్చేందుకేనని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇది కేవలం విరామం మాత్రమే ఫుల్‌స్టాప్ కాదని ఆయన గురువారం ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తీరు పై సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు వెలువరించేవరకూ వేచిచూడాలని కోరారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా మొత్తం ప్రక్రియ మొదటికి వస్తుందని తెలిపారు.
ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ ఉపాధ‍్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ చట్టంపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఎన్ ఆర్ సీ ని డిమానిటైజేషన్ ఆఫ్ సిటిజన్ షిప్ గా ఆయన అభివర్ణించారు. దేశంలో ఎన్ ఆర్ సీ పై చర్చ ఉండబోదన్న ప్రధాని మోదీ ప్రకటనను వ్యూహాత్మక చర్యగా ప్రశాంత్ కిషోర్ అన్నారు. మరోవైపు ఎన్ ఆర్ సీ లో గుర్తించిన ముస్లిమేతర అక్రమ వలసదారులను పౌర చట్టం రక్షిస్తుందని, పెద్దసంఖ్యలో ముస్లింలు దేశం వీడివెళ్లాల్సి వస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.