తమిళనాడు దివంగత సీఎం - అన్నాడీఎంకేను మొన్నటిదాకా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించేసిన జయలలిత... అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి సుదీర్ఘ కాలం పాటు చికిత్స తీసుకున్నా... తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తమిళ తంబీలంతా... తాము అమ్మగా భావించే జయ చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆ తర్వాత తమిళ నాట రసవత్తర రాజకీయం తెరగేంట్రం చేసింది. జయ నమ్మిన బంటు పన్నీర్ సెల్వంను సీఎం పీఠం నుంచి దించేసిన జయ నెచ్చెలి శశికళ... తనకు అనుకూలంగా ఉన్న ఎడప్పాడి పళనిసామికి అధికారం కట్టబెట్టారు. జాతీయ స్థాయి రాజకీయాలు వేలుపెట్టిన కారణంగా శశికళ నేరుగా జైలుకు వెళ్లగా... మొన్నటిదాకా విరోధులుగా మెలగిన ఓపీఎస్ - ఈపీఎస్ లు ఇప్పుడు కలిసిపోయారు. శశికళతో పాటు ఆమె బంధువర్గంగా పేరుగాంచిన మన్నార్ గుడి మాఫియాను పార్టీ నుంచి వారిద్దరూ గెంటేశారు.
ఇదంతా ఓ వైపు నాన్ స్టాప్ ట్విస్టులతో సాగుతుండగానే... అసలు జయలలితకు అందిన చికిత్స - అంతిమ ఘడియల్లో జయ పరిస్థితికి సంబంధించి వివరాలకు సంబంధించి ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జయకు అందించిన చికిత్స మొత్తం రహస్యంగా సాగగా... ఆమెను పరామర్శించేందుకు వచ్చిన జాతీయ స్థాయి నేతలకు కూడా ఆమెను చూసే భాగ్యం కలగలేదు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కొనసాగిన ఈ చికిత్సపై ఒక్క తమిళ తంబీలకే కాకుండా యావత్తు దేశ ప్రజలకు కూడా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకంటూ రంగంలోకి దిగిన ఈపీఎస్ సర్కారు... జయ మరణంపై సమగ్ర దర్యాప్తునకు పక్కా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించింది.
ఈ కమిషన్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే... జయ మేనల్లుడు దీపక్ - శశికళ కుటుంబ సభ్యులు - ఈపీఎస్ సర్కారుకు ఎదురొడ్డి పోరాడుతున్న టీవీవీ దినకరన్ లు సంచలన ప్రకటనలే చేశారు. జయ చికిత్సకు సంబంధించి మొత్తం వీడియో తమ వద్ద ఉందని దినకరన్ ప్రకటిస్తే... అత్త పండ్లు తిన్నదని దీపక్ ప్రకటించాడు. ఈ క్రమంలో అసలు జయకు అందించిన చికిత్స సందర్భంగా అసలు వీడియో తీశారా? అన్న విషయంపై ఆమెకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాస్ సీ రెడ్డి కాసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. అపోలో ఆసుపత్రి సమీపంలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా మీడియా మాట్లాడిన ప్రతాప్ సీ. రెడ్డి ... జయలలిత చికిత్స పొందిన గదిలో సీసీ కెమెరాలు లేవని చెప్పారు. అయితే జయలలితకు ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స చేశారు అనే పూర్తి సమాచారం మా దగ్గర భద్రంగా ఉందని, విచారణ కమిషన్ కు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.
జయలలితకు 75 రోజుల పాటు చికిత్స అందించామని, చికిత్స సమయంలో ఆమెకు ఎలాంటి ఔషదాలు ఇచ్చాము, ఎలాంటి చికిత్స చేశాము, ఆమె ఏమేమి ఆహారం తీసుకున్నారు, ఆమెను ఎవరెవరు కలిశారు అనే పూర్తి సమాచారం ఉన్న రికార్డులు మాదగ్గర జాగ్రత్తగా ఉన్నాయని ప్రతాప్ సీ. రెడ్డి వివరించారు. ఫలితంగా జయ చికిత్సకు సంబంధించి మొత్తం వీడియో తమ వద్ద ఉందని చెప్పిన దినకరన్ తో పాటు జయ మేనల్లుడు దీపక్ వాదన తప్పని తేలిపోయింది. ఇదిలా ఉంటే... ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జయలలిత చికిత్స పొందుతున్న గదిలో ఎందుకు సీసీ కెమెరాలు లేవు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత అయినా ఆమె భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అమ్మ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే జయలలితకు భద్రత కల్పిస్తున్న జడ్ ఫ్లస్ సెక్యూరిటీ అక్కడి నుంచి మాయం కావడం కూడా ఇప్పుడు చర్చకు దారి తీసింది.