సెహ్వాగ్ పై ప్రీతి ఫైర్.. పంజాబ్‌ కు గుడ్ బై!

Update: 2018-05-12 05:59 GMT
వివాదాల‌తో దోస్తానో చేయ‌టం ఐపీఎల్ టోర్నీలో మామూలే. ఈ టోర్నీ మొద‌లైన నాటి నుంచి ప్ర‌తి సీజ‌న్లో ఏదో ఒక ర‌చ్చ తెర మీద‌కు వ‌స్తూ ఉంటుంది. గ‌డిచిన రెండేళ్లుగా పెద్ద వివాదాలు చోటు చేసుకోన‌ప్ప‌టికీ.. జ‌ట్ల య‌జ‌మానుల అత్యుత్సాహం.. మితిమీరిన వారి జోక్యం ప‌లు సంద‌ర్భాల్లో క్రీడాకారుల‌కు.. సీనియ‌ర్ల‌కు మింగుడుప‌డ‌ని రీతిలో మారుతుంటుంది.

పెట్టుబ‌డి పెట్టామ‌న్న మాట త‌ప్పించి.. క్రికెట్ మీద క్రికెట‌ర్ల కంటే ఎక్కువ అవ‌గాహ‌న ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీ య‌జ‌మానులు ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. ఆట అంటే గెలుపోట‌ముల స‌మాహారం. అయితే.. అనుక్ష‌ణం డ‌బ్బు లెక్క‌లు వేసుకునేలా ఉండే ఐపీఎల్ టోర్నీలో ఆట‌లో క్రీడాస్ఫూర్తికి మించిన అంశాలే కీరోల్ ప్లే చేస్తుంటాయి.

త‌మ ఫ్రాంచైజ్ గెలుపోట‌ముల్ని త‌మ వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాతో లెక్క‌లు వేసుకునే ప్ర‌ముఖుల పుణ్య‌మా అని త‌ర‌చూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టు విష‌యంలో జ‌రిగింది.

ఈ ఫ్రాంచైజీ య‌జ‌మానుల్లో ఒక‌రు బాలీవుడ్ సినీ న‌టి ప్రీతిజింటా. ఆమెకు క్రికెట్ మీద ఉన్న అవ‌గాహ‌న ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సీనియ‌ర్ క్రికెట‌ర్.. మాజీ టీమిండియా ముఖ్యుడైన వీరేంద్ర సెహ్వాగ్ తో పోలిస్తే అవ‌గాహ‌న త‌క్కువ‌నే చెప్పాలి. అయితే.. ఐపీఎల్ టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో త‌న జ‌ట్టు ఓట‌మి పాలు కావ‌టం ప్రీతిని తెగ బాధించింద‌ట‌. అంతే.. స‌హ‌నం మిస్ అయిన ఆమె.. టీమ్ మెంటార్ అయిన సెహ్వాగ్‌ను ప్ర‌శ్నించ‌టంతో పాటు.. అశ్విన్ ను మూడోస్థానంలో పంప‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం సెహ్వాగ్‌ను నొచ్చుకునేలా చేసింద‌ట‌.

దీని కార‌ణంగానే మ్యాచ్ అయ్యాక నిర్వ‌హించిన మీడియా స‌మావేశానికి ప్రీతి.. సెహ్వాగ్ రావాల్సి ఉన్నా రాలేద‌ని.. దీనికి కార‌ణం అంత‌కు ముందు జ‌రిగిన గొడ‌వేన‌ని చెబుతున్నారు. త‌న‌ను ప్ర‌శ్నించ‌టం.. త‌న వృత్తిలో అదే ప‌నిగా జోక్యం చేసుకుంటున్న ప్రీతి తీరుపై కింగ్స్ ఎలెవ‌న్ యాజ‌మాన్యానికి సెహ్వాగ్ ఫిర్యాదు చేసిన‌ట్లు చెబుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కింగ్స్ ఎలెవ‌న్ తో ఐదేళ్ల పాటు మెంటార్ గా వ్య‌వ‌హ‌రించేందుకు కుద‌ర్చుకున్న ఒప్పందాన్ని బ్రేక్ చేసి.. గుడ్ బై చెప్పాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుత సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కూ 10 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ ఆరింట్లో గెలిచి ఆగ్ర‌స్థానంలో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఒక మ్యాచ్ లో ఓట‌మిపై ప్రీతి ఇంత గుస్సా వ్య‌క్తం చేయ‌టం చూస్తే.. ఐపీఎల్ ఫార్మాట్‌లో ఉన్న అతి పెద్ద లోపం ఇట్టే అర్థ‌మైపోతుంది. డ‌బ్బులు ఉండాలే కానీ.. కొమ్ములు తిరిగిన క్రికెట‌ర్ల‌ను సైతం కొనేసి త‌మ జ‌ట్టులో ఆడేలా చేయ‌ట‌మే కాదు.. వారికి బాస్ లుగా మారే ద‌రిద్రం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు. ఐపీఎల్ కాకుంటే.. సెహ్వాగ్ కు క్రికెట్ గురించి ప్రీతా పాఠాలు చెప్ప‌ట‌మా? అన్న ఘాటు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. వీరూతో త‌న‌కు గొడ‌వైన‌ట్లుగా మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌పై ప్రీతి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తాను తిట్టిన‌ట్లుగా.. వీరు మ‌న‌స్తాపానికి గురైన‌ట్లుగా వ‌చ్చిన వార్త‌లో ఏ మాత్రం నిజం లేద‌ని పేర్కొంది. సెహ్వాగ్‌కు త‌న‌కు మ‌ధ్య ఎలాంటి వాగ్వాదం జ‌ర‌గలేద‌ని పేర్కొంది.

త‌న‌కు.. వీరూకి మ‌ధ్య జ‌రిగిన సంబాష‌ణ‌కు ఏదేదో క‌లిపి రాసేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్రీతి.. వారికి డ‌బ్బులు ఇచ్చి నిజాలు రాయించాల‌నుకోవ‌టం లేద‌ని ఫైర్ అయ్యింది. మేం మీడియాను ద‌గ్గ‌ర‌కు తీసుకొని వార్త‌లు రాయించుకోవాల‌నుకోవ‌టం లేద‌న్న ఆమె.. త‌మ మ‌ధ్య మాట‌ల్ని ఎక్క‌డికో తీసుకెళ్లార‌ని పేర్కొంది. మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అబ‌ద్ధాలుగా సోష‌ల్ మీడియాలో పేర్కొంది. మ‌రి.. నిజం ఏమిట‌న్న‌ది కొన్ని రోజులు గ‌డిస్తే స‌రిపోతుంద‌న్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News