ద‌స‌రా బొనాంజా!..బాబుకు మోదీ దెబ్బేశారు!

Update: 2017-09-30 09:08 GMT
ద‌స‌రా... అంద‌రికీ సంతోషాలు నింపే పండుగ‌. దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ ద‌స‌రా సంబ‌రాలు మిన్నంటే రోజే ద‌స‌రా. అయితే ఇది టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు - ఆయ‌న పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు మాత్రం ఈ ద‌స‌రా సంబ‌రాల‌ను తేలేద‌నే చెప్పాలి. అదేంటీ ద‌స‌రా.. ఒకరికి సంతోషాలు నింపి, మ‌రొక‌రి చేదు వార్త‌లు మోసుకొస్తుందా? అంటే... అదేమీ లేదు గానీ... ఎందుక‌నో గానీ ప్రధాని న‌రేంద్ర మోదీ ద‌స‌రా ప‌ర్వ‌దినం నాడు తీసుకున్న కీల‌క నిర్ణ‌యం... ఇటు చంద్ర‌బాబుతో పాటు అటు మోత్కుప‌ల్లి ఇంట సంతోషం స్థానంలో దిగాలును నింపింద‌నే చెప్పాలి. ఆ సంగ‌తేందో చూద్దాం ప‌దండి.

ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌ను - కేంద్ర పాలిత ప్రాంతాల‌కు లెఫ్ట్‌ నెంట్ గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మిస్తూ కాసేప‌టి క్రితం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొత్తం ఐదుగురిని గ‌వ‌ర్న‌ర్లుగా ఎంపిక చేసిన కేంద్రం.. వారిని ఏఏ రాష్ట్రాల‌కు కేటాయిస్తున్న విష‌యాన్ని కూడా ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో మొత్తం ఆరుగురు ఉండ‌గా... వారిలో ఐదుగురికి గ‌వ‌ర్న‌ర్లుగా - మ‌రొక‌రికి లెఫ్ట్‌ నెంట్ గ‌వ‌ర్న‌ర్‌ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు ద‌క్కాయి. ఆ జాబితా పూర్తి వివ‌రాల్లోకెళితే... తమిళనాడుకు భన్వరిలాల్‌ పురోహిత్‌  - మేఘాలయకు గంగాప్రసాద్‌ - అరుణా చల్‌ ప్రదేశ్‌ కు బీడీ మిశ్రా - బిహార్‌కు సత్యపాల్‌ మాలిక్‌ - అస్సోంకు జగదీష్‌ ముఖీ గ‌వ‌ర్న‌ర్లుగా నియ‌మితుల‌య్యారు. అండమాన్‌ నికోబార్‌ కు మాజీ అడ్మిరల్‌ దేవేంద్ర కుమార్‌ జోషిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా నియమిస్తూ మోదీ సర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

అయినా ఈ వార్త స్వాగ‌తించ‌గ్గ‌దే క‌దా అంటే... అంద‌రూ స్వాగ‌తించేదే. అయితే చంద్ర‌బాబు - మోత్కుప‌ల్లికి మాత్రం ఈ వార్త తీవ్ర నిరాశ కలిగించేదే. ఎందుకంటే మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ గిరీ ఇవ్వాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు పంపిన ప్ర‌తిపాద‌న ఇంకా మోదీ కార్యాల‌యంలోనే పెండింగ్‌ లో ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ గిరీ వ‌చ్చేసిందంటూ వార్త‌లు రావ‌డం, ఆ వెంట‌నే కేంద్రం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం, ఆ వార్త‌ల‌న్నీ చ‌డీచ‌ప్పుడు లేకుండా స‌ద్దుమ‌ణ‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారిన సంగ‌తి తెలిసిందే. మొన్న‌టికి మొన్న తెలుగు నేల‌కు చెందిన కొణిజేటి రోశ‌య్య త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌ గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సంద‌ర్భంలో ఆ పద‌వి మోత్కుప‌ల్లికి ఖాయ‌మ‌నే మాట వినిపించింది. అయితే త‌మిళ‌నాట నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి నియామ‌కాన్ని ప‌క్క‌నపెట్టేసిన మోదీ స‌ర్కారు.. బీజేపీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావుకు అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది.

తాజాగా సీహెచ్‌ ను ఆ అదన‌పు బాధ్య‌త‌ల‌ను తొల‌గించేసిన మోదీ.. కొత్త‌గా భ‌న్వరిలాల్ పురోహిత్‌ ను త‌మిళ‌నాడుకు పూర్తి స్థాయి గ‌వ‌ర్న‌ర్‌ గా నియ‌మించారు. మొత్తం ఆరుగురికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టిన మోదీ. ఆ జాబితాలో మోత్కుప‌ల్లికి స్థానం క‌ల్పించ‌లేదంటే..చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న బుట్ట‌దాఖ‌లు చేసిన‌ట్లుగానే వార్త‌లు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా... ఇంకో ఏడాదిన్న‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో ద‌ఫా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశాలు దాదాపుగా లేవ‌న్న మాటే వినిపిస్తోంది. అంటే ఇక మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ గిరీ దాదాపుగా మృగ్య‌మేన‌న్న‌మాట‌.
Tags:    

Similar News