ప్రమోషన్లు పొందిన వేళ.. కోరుకున్న పోస్టులు వచ్చేందుకు భారీగా డబ్బులు చేతులు మారుతున్న వైనం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కీలక పోస్టుల్లో కూర్చోవాలంటే లక్షలాది రూపాయిలు చెల్లిస్తే ఇట్టే కూర్చోవటమే కానీ.. దానికి అర్హత లాంటి వాటిని లైట్ తీసుకున్న వైనం షాకింగ్ గా మారింది. నీతివంతమైన పాలనను జరుపుతున్నట్లుగా సీఎం జగన్ చెబుతున్నప్పటికీ.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందంటున్నారు. తాజాగా మండల పరిషత్ అభివ్రద్ధి అధికారులు (ఎంపీడీవో) పలువురికి ప్రమోషన్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాము కోరుకున్న పోస్టులు దక్కించుకోవటానికి రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి పేషీలోని ఒకరిద్దరు తెర వెనుక ఉండి చక్రం తిప్పారని.. పోస్టు ప్రాధాన్యతను అనుసరించి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తే చాలు.. కోరుకున్న పోస్టులు చేతికి వచ్చేసిన పరిస్థితి.
ఇలా పైసలు ఇచ్చిన వారికి జెడ్పీ సీఈవోగా.. డ్వామా డీపీగా.. జడ్పీ డిప్యూటీ సీఈవోగా.. డీపీవోగా పోస్టులు ఇవ్వటం వెనుక భారీ కథ నడిచినట్లుగా చెబుతున్నారు. మరికొందరు తాము ఇప్పటికే పని చేస్తున్న చోటనే ఉండిపోయి.. స్థాన చలనం లేకుండా ఉన్నందుకు సైతం భారీ ఎత్తున చెల్లింపులు చెల్లించాల్సి వచ్చినట్లు చెబుతున్నారు.
ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే.. అలాంటి వారికి కేటాయించిన పోస్టుల నుంచి వారి పేర్లను తొలగించి.. తమకు ముడుపులు చెల్లించిన వారికి పోస్టులు ఇచ్చేందుకు సైతం వెనుకాడని వైనం సంచలనంగా మారింది.
కొన్నికీలక స్థానాల్లో జూనియర్లను ఎంపిక చేయటం వెనుక కూడా చెల్లింపుల ప్రభావమే కారణమని చెబుతున్నారు. మంత్రి పేషీ సిఫార్సు చేసిన వారికి కీలక పోస్టింగులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
దీంతో.. పైరవీలకే పోస్టింగులు తప్పించి.. పని చేసే వారికి కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు రావటం ఖాయమన్న విషయాన్ని సీఎం జగన్ గ్రహించాలని.. అలాంటి తప్పులు జరగకుండా చూడాలన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.