నో రెస్పాన్: మోడీ వ్యూహం అదే?

Update: 2021-07-28 04:44 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైలెన్స్ తో చంపేస్తాడు.. ప్రతిపక్షాలు ఎంత పెద్ద ఇష్యూతోనైనా ఎంత గగ్గోలు పెట్టినా సరే ఆ మౌనం వీడడం లేదు. ఆయన వ్యవహారశైలినే చాలా విచిత్రంగా ఉంటుందని అంటుంటారు.

తాజాగా దేశాన్ని ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్ వేర్ వ్యవహారం కుదిపేస్తోంది. దేశంలోని ప్రతిపక్షాలు, ప్రముఖులు, జర్నలిస్టులు, సుప్రీంకోర్టు జడ్జీల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసిన వ్యవహారంపై పార్లమెంట్ లో  రచ్చ కొనసాగుతోంది. వర్షకాల సమావేశాలు ప్రారంభం రోజున 19వ తేదీనే పెగాసస్ వ్యవహారం మీడియాలో వచ్చేసింది. అప్పటికే మోడీ సర్కార్ పై దేశంలోని ప్రతిపక్షాలు, ప్రముఖులు మండిపడ్డారు. ఇప్పటికీ అంతటా ఇదే రచ్చ కొనసాగుతోంది.

గడిచిన 8 రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో ఈ పెగాసస్ వ్యవమారం అట్టుడుకుతోంది. ఇంత రచ్చ జరుగుతున్నా కూడా ప్రధాని నరేంద్రమోడీ దీనిపై ఒక్క ప్రకటన చేయడం లేదు. నోరు విప్పడం లేదు. పెగాసస్ ద్వారా మొబైల్ ఫోన్ ట్యాపింగ్ అన్నడి మోడీకి తెలియకుండా జరిగే అవకాశమే లేదు. పైగా సాఫ్ట్ వేర్ కొనుగోలుకు కేంద్రం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చుపెట్టిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంత గోల జరుగుతున్న మోడీ మాత్రం పార్లమెంట్ లో ఎందుకు నోరు విప్పడం లేదన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి హ్యాక్ చేశామన్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉంది. అయితే పెగాసస్ లాంటి కీలకమైన అంశంపై మోడీ నోరువిప్పకపోవడంతో ట్యాపింగ్ ఆరోపణలు నిజమేనని ప్రతిపక్షాలు.. మిగతా వారు భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

గతంలో కూడా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ సహా ఎన్నో కీలక విషయాలపై మోడీ స్పందించిన దాఖలాలు లేవు. నిర్ణయం తీసుకోవడం.. ప్రజలపై వదిలేయడం తప్పితే దానిపై వచ్చిన ఆరోపణలపై నోరువిప్పిన పాపాన పోలేదు. పార్లమెంట్ కు, జనాలకు అసలు మోడీ జవాబుదారి కాదా? అన్న డిమాండ్ ను ప్రతిపక్షాలు తెరపైకి తెస్తోంది.

నాడు రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం విషయంలోనూ మోడీ నోరు విప్పలేదు. ఇప్పుడు పెగాసస్ లాంటి నిఘా స్కాంలోనూ మోడీ నుంచి ఏదీ రావడం లేదు. దీన్ని బట్టి తాను మౌనంగా ఉంటా.. మీరు కొట్టుకుచావండి అన్నట్టుగా మోడీ తీరు ఉంటోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు.
Tags:    

Similar News