కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు మొత్తం గతంలో ఎన్నడూ లేని విదంగా అతలాకుతలం అయ్యాయి. అయితే , న్యూజిలాండ్ దేశం మాత్రం కరోనా మహమ్మారిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. ఒక్క పాజిటివ్ కేసు నమోదు అయితే, ఏకంగా వారం రోజుల పాటు లాక్ డౌన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్ లో కరోనా కట్టడికి ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీసుకున్న నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి.
అయితే, ఈ మధ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమెకు వింత ప్రశ్న ఎదురైంది. దాంతో షాక్ తిన్న ఆమెకు ఓ దశలో చమటలు పట్టాయట, ఆ ప్రశ్నకు ఆమె ఇచ్చిన హావభావాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా అవుతున్నాయి. ఇక, అసలు విషయానికి వస్తే ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్ ఫీల్డ్ తో కలిసి ప్రధాని జసిండా ఆర్డెర్న్ మీడియాతో మాట్లాడుతుండగా అక్లాండ్ లోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న రోగిని చూసేందుకు వచ్చిన మహిళ, అతడితో ఆస్పత్రిలోనే శృంగారంలో పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయని, అది ప్రమాదకరం కదా అంటూ ప్రధానిని ప్రశ్నించారు ఓ మీడియా ప్రతినిధి.
దీంతో షాక్ తిన్న జసిండా, ఆ వెంటనే తేరుకుని ధీటైన జవాబే ఇచ్చారు. కోవిడ్ సమయంలోనే కాదు, సాధారణ పరిస్థితుల్లో కూడా ఆస్పత్రుల్లో అలాంటి చర్యలు సరికాదని సమాధానం ఇచ్చారు. అయితే, ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆర్డెర్న్ ముఖం మారిపోయింది. మొదట ఆశ్చర్యపోయిన ప్రధాని, తర్వాత నవ్వడం ప్రారంభించారు. ఆమె రియాక్షన్ మాత్రం ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. మరోవైపు ఆ ప్రశ్నకు డాక్టర్ బ్లూమ్ ఫీల్డ్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ఇది చాలా ప్రమాదకర చర్య అని నేను అనుకుంటున్నాను, కానీ, ఆ పరస్పర చర్య గురించి తమ దగ్గర ఎలాంటి వివరాలు లేవన్నారు. కోవిడ్ పరిస్థితితో సంబంధం లేకుండా, అలాంటివి సాధారణంగా ఆస్పత్రులు జరగడం మంచిది కాదన్నారు.