కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సోదరి - ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ నిజంగానే స్వరం పెంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన ప్రభుత్వాన్ని నేరుగానే టార్గెట్ చేస్తున్న ప్రియాంక... మాటలనే తూటాలుగా మలిచి వదులుతున్నారు. ప్రియాంక సంధిస్తున్న ప్రశ్నలు చాలా సూటిగా సుత్తి లేకుండా మోదీ సర్కారును డిఫెన్స్ లో పడేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పెద్దగా కనిపించని ప్రియాంక... రెండో దశ పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆగ్రాలో పర్యటించిన ప్రియాంక... మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు.
అసలు సమస్యలను వదిలేసి... అక్కరకు రాని అంశాలతోనే బీజేపీ పాలన సాగిస్తోందని తనదైన శైలి వాగ్బాణాలను సంధించిన ప్రియాంక... తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా? అంటూ సవాల్ విసిరారు. ప్రియాంక ప్రస్తావించిన అంశాల్లోకి వెళితే... ఎన్నికల వేళ ఉద్యోగాల గురించి బీజేపీ తప్పనిసరిగా నోరిప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఏదాడికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని ఎంతవరకు అమలు చేశారని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై యువతకు మోదీ సర్కారు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం - రైతు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం... వాటిని అసలు పట్టించుకోకుండానే ముందుకు సాగుతోందని దుయ్యబట్టారు.
పాకిస్థాన్ పై చేసిన దాడులనే అస్త్రాలుగా మలచుకుని జనాన్ని మాయ చేసేందుకు మోదీ సర్కారు యత్నిస్తోందని ధ్వజమెత్తారు. దేశం - జాతీయత గురించి మాత్రమే మాట్లాడే బీజేపీ నేతలు....నిరుద్యోగులు - రైతులు - ఇతర అన్ని వర్గాలను కూడా విస్మరించేశారని ఆరోపించారు. అసలు దేశ ప్రజలకు మోదీ ఏం చేశారో చెప్పాలని కూడా ఆమె ప్రశ్నించారు. మహిళలు, వారి భద్రత కోసం మోదీ సర్కారు ఏం చేసిందని ప్రియాంక సూటిగానే ప్రశ్నించారు. మోదీ పాలన నియంత్రుత్వానికి పరాకాష్టగా మారిందని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, సంస్థల పట్ల ప్రభుత్వం విచక్షణతో వ్యవహరించాల్సి ఉందని, అయితే మోదీ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగానే వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు.
ఈ సందర్భంగా ప్రియాంక ఓ రైతుకు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల ఓ రైతు తాను పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడంతో... తన పంట అమ్మగా వచ్చిన రూ.490 నగదును నేరుగా ప్రధానికే పంపారని ఆమె తెలిపారు. సదరు రైతు ఆవేదనను అర్థం చేసుకోలేని మోదీ సర్కారు... తమను ప్రశ్నించే వారిపై జాతి వ్యతిరేక ముద్ర వేసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రియాంక గాంధీ తనదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తూనే.. మోదీ సర్కారును డిఫెన్స్ లో పడిపోయేలా చేస్తున్నారని చెప్పాలి.