తన అన్న ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీకి సై అని మరోసారి ప్రకటించారు ప్రియాంక వాద్రా. గత కొన్నాళ్లుగా ప్రియాంక వాద్రా వారణాసి నుంచి పోటీ చేయబోతోందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి మోడీని ప్రియాంక ఢీ కొట్టబోతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సూటిగా స్పందించడం లేదు.
కొంతమంది నేతలేమో అందుకు సంబంధించి నిర్ణయం రాహుల్ చేతిలో ఉందని - ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రియాంక పోటీ చేయడం - చేయకపోవడం ఉంటుందని అన్నారు. ఇక ఈ అంశం గురించి రాహుల్ నే అడగగా.. అది సస్పెన్స్ అని ఆయన అన్నారు!
సస్పెన్స్ మంచిదేనంటూ.. తన సోదరి వారణాసిలో పోటీ చేస్తుందా - చేయదా.. అనే అంశం గురించి రాహుల్ సూటిగా స్పందించలేదు. ఆ విషయం గురించి సస్పెన్స్ ను మరి కొంత కాలం కొనసాగించబోతున్నట్టుగా రాహుల్ చెప్పుకొచ్చారు.
అయితే ఆ విషయంలో కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రియాంక వారణాసి లో పోటీ చేస్తే భవిష్యత్ కు ఇబ్బందికరం అని - ప్రియాంక వారణాసిలో ఓడిపోతే పార్టీ భవితవ్యాన్ని చేజేతులారా దెబ్బతీసినట్టుగా అవుతుందని కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఆమె పోటీ చేయకపోవడమే మేలని వారు అంటున్నారు.
ఇక ఈ అంశంపై మరోసారి స్పందించారు ప్రియాంక. తన అన్న ఆదేశించడమే ఆలస్యం తను పోటీ చేయడం ఖాయమన్నట్టుగా ఆమె ప్రకటించారు. మరి ఈ విషయంలో రాహుల్ ఏం డిసైడ్ చేస్తారో - మోడీని రాజకీయంగా ఢీ కొట్టడానికి తన చెల్లిని ఆయన రంగంలోకి దించుతారో ఏమో మరి!