25 కోట్లు ఇస్తావా.. ఆ వీడియో నెట్ లో పెట్టాలా?

Update: 2019-02-24 12:48 GMT
బాలీవుడ్ అనగానే క్యాస్టింగ్ కోచ్.. నెపొటిజం.. ఇలా చాలా నెగెటివ్ టాపిక్ లు గుర్తొస్తాయి కానీ చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు బ్లాక్ మెయిలర్స్ బెడద కూడా ఎక్కువే.  ఒక్కోసారి ఏకంగా మాఫియా వారే రంగంలోకి దిగి స్టార్ హీరోలను నిర్మాతలను బెదిరిస్తుంటారని కూడా వార్తలు వస్తుంటాయి.  రీసెంట్ గా ఒక బాలీవుడ్ నిర్మాతకు బెదిరింపులు ఎదురాయ్యాయి.. కానీ మాఫియా నుండి కాదు లెండి.. మసాజ్ గ్యాంగ్ నుండి.

అనిల్ అనే బాలీవుడ్ నిర్మాతకు గత కొంతకాలం నుండి కొందరు అజ్ఞాతవ్యక్తులు ఫోన్ చేసి "మీ నాన్నగారి శృంగార లీలలు ఉండే వీడియోను ఆన్ లైన్  లో పెడతాం.. మాకు కనుక రూ. 25 కోట్లు ఇస్తే అలా చేయకుండా వదిలేస్తాం" అంటూ బెదిరిస్తున్నారట.  దీంతో సదరు నిర్మాత పోలీస్ కమీషనర్ ను ఆశ్రయించాడు.  ముంబై లోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాడు.  రంగంలోకి దిగిన పోలీసులు ఈ బ్లాక్ మెయిల్ కు పాల్పడిన గ్యాంగుకు సంబంధించిన ఐదు మందిని అరెస్ట్ చేశారట. ఆ గ్యాంగులో ఒక మాయ లేడీ కూడా ఉందట.

అసలు ఏం జరిగిందంటే అనిల్ ఫాదర్ కు 65 ఏళ్ళ వయసట.  అయన పార్కిన్ సన్స్ వ్యాధి ఉండడంతో మసాజ్ థెరపీలు చేయించుకోవాల్సి వచ్చింది.  అలా మసాజ్ చేసే లేడీతో పెద్దాయనను కమిట్ చేయించి ఫుల్ గా వీడియో తీసి పెట్టుకున్నారు.  ఆ వీడియోను అడ్డం పెట్టుకొనే బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు.  కానీ నిర్మాత నిర్భయంగా పోలీసులను ఆశ్రయించడంతో మసాజ్ గ్యాంగు బండారం బయటపడింది. ఈ మసాజ్ గ్యాంగు గతంలో కూడా ఇలానే  వేరేవాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజారట. ఈసారి పథకం ఫలించక పోవడంతో ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.
    

Tags:    

Similar News