వందల ఏళ్లు గడిచినా తెలుగువారందరికి రుద్రమదేవి గురించి చెప్పినంతనే రోమాలు నిక్క పొడుచుకుంటాయి. తెలుగోళ్ల సాహసం ఎంతలా ఉంటుందన్న దానికి రుద్రమదేవి నిలువెత్తు నిదర్శనంగా చెబుతారు. కాకతీయ సామ్రాజ్ఞి మరణానికి సంబంధించిన కీలక ఆధారం ఒకటి తాజాగా బయటపడింది. ఆమె మరణంపై ఇప్పటికే కొన్ని వాదనలు ప్రచారంలో ఉండగా.. తాజాగా లభించిన శిల్పం ప్రకారం ఆమె వయసు నిర్దారణ కావటంతో పాటు.. ఆమె మరణం ఎలా సంభవించిందన్న విషయాన్ని రూఢీ చేసే శాసనం ఒకటి లభించింది.
రుద్రమసేనాని ఒకరు తయారు చేయించిన శాసనం ప్రకారం ఆమె మరణానికి సంబంధించిన శాసనం లభించటంతోపాటు.. దాని ప్రకారం మరణించే నాటికి రుద్రమదేవి వయసు 82 సంవత్సరాలుగా తేలింది. గతంలో లభించిన శాసనాలకు భిన్నమైన శాసనం తాజాగా లభిచింది. తాజాగా సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం బెక్కల్లులో లభించిన శాసనం ప్రకారం రుద్రమదేవి మరణానికి సంబంధించిన స్పష్టమైన ఆధారం లభించినట్లుగా భావిస్తున్నారు.
బెక్కల్లు గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కాకతీయుల నాటి విష్ణాలయం గర్భగుడిలో ఈ శిల్పాన్ని గుర్తించారు. ఈ శిల్పాన్ని విశ్లేషించగా.. రుద్రమదేవి వీరమరణం గురించిన సమాచారం ఉన్నట్లుగా గుర్తించారు. మరో కొత్త విషయం ఏమిటంటే.. రుద్రమదేవి మరణించే నాటికి ఆమె వయసు 82 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. సామంతరాజు అంబదేవుడి చేతుల్లో మరణించి ఉంటారని భావిస్తున్నారు.
రుద్రమదేవి మరణంపై శాసనం వేయించటం ఇష్టం లేని ఆమె మనము ప్రతాపరుద్రుడికి మనస్కరించలేదని.. అందుకే మరణం మీద శాసనం వేయించి ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. తాజాగా లభించిన శిల్పంలో రుద్రమదేవిని సర్వసైన్యాధ్యక్షురాలిగా సైనిక దుస్తులు.. రక్షణ కవచం ధరించినట్లుగా తీర్చిదిద్ది ఉంది. ఆమె విసిరిన ఆయుధం గురి తప్పగా.. నేలపై ఉన్న అంబదేవుడు ఆమె అశ్వాన్ని నిలువరించి ఖడ్గంతో దాడి చేస్తున్నట్లుగా ఉంది. శిల్పంలోనూ రుద్రమదేవి వృద్ధాప్యంలో ఉన్నట్లుగా.. అంబదేవుడు పిన్నవయస్కుడిగా ఉన్నట్లుగా ఉంది. యుద్ధంలో పాల్గొన్న సైనికుడు శిల్పాన్ని చెక్కించి ఉంటారని భావిస్తున్నారు.