తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. రెండు.. మూడు రోజులకు ఒకసారి అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కరోనా అప్డేట్స్ ఇవ్వటం తెలిసిందే. ఎప్పుడో కానీ మీడియా ముందుకు రాని కేసీఆర్.. కరోనా ఎపిసోడ్ లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. మళ్లీ ఈమధ్యన ప్రజల ముందుకు రావట్లేదు. కేంద్రం విధించిన లాక్ డౌన్ 2.0 మరో రెండు రోజుల్లో ముగుస్తుంటే.. తెలంగాణలో మాత్రం మే 7తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ 3.0 మీద ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. మే మూడు తర్వాత మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించాలని పేర్కొన్న వైనం ఆసక్తికరంగా మారింది.
దగ్గర దగ్గర నలభై రోజులుగా దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ పుణ్యమా అని ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే తీరులో లాక్ డౌన్ కొనసాగితే.. విపత్కర పరిణామాలు ఏర్పడతాయని.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళలోనూ వెనక్కి తగ్గని పంజాబ్ ముఖ్యమంత్రి లాక్ డౌన్ పొడిగింపు విషయంలో వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆయన బాటలో మరో రాష్ట్ర చేరింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా లాక్ డౌన్ పొడిగింపు విషయంలో సానుకూల నిర్ణయాన్ని తీసుకున్నారు. మే చివరి వరకూ లాక్ డౌన్ ను పొడిగించాలని దీదీ డిసైడ్ అయ్యారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమబెంగాల్ లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో కొత్త కేసుల సంఖ్య తగ్గక పోగా.. పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపు దిశగా దీదీ నిర్ణయం తీసుకున్నారు. కాకుంటే.. లాక్ డౌన్ వేళ సడలింపుల విషయంలో కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
లాక్ డౌన్ పొడిగింపు అవసరమా? లేదా? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. మేధావి ముద్ర ఉన్న కేసీఆర్ మౌనంగా ఉండటం ఏమిటన్నది ప్రశ్న. తన మనసుల్ని భావాల్ని మొహమాటం లేకుండా బయటపెట్టేసే ఆయన.. లాక్ డౌన్ పొడిగింపు విషయం మీద ఎందుకు మాట్లాడటం లేదన్నది ఆసక్తికరంగా మారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లాక్ డౌన్ విషయంలో ఆయన కరకుగానే ఉన్నారని.. కొన్ని మినహాయింపులు తప్పించి.. లాక్ డౌన్ ను పొడిగించటానికే ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఒక్కో రాష్ట్రం లాక్ డౌన్ 3.0 విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుంటే.. కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.