అనూహ్యమైన ప్రకటనలు చేయడం ద్వారా అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏకకాలంలో ఆశ్చర్యానికి గురిచేశారు. వివాదాలకు ప్రియుడైన ట్రంప్ గురించి ముందుగా తెలుసుకుందాం. అగ్రరాజ్యం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి తనకున్న అన్ని వ్యాపారాలను వదిలేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇక నుంచి తన కొడుకులు - ఇతర ప్రతినిధులు ఆ వ్యాపారాలను చూసుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్రంప్ తన సందేశాలను పోస్ట్ చేశారు.
"నా ఇద్దరు కుమారులు డాన్ - ఎరిక్ - ఇతర ప్రతినిధులు ఆ వ్యాపారాలను చూసుకుంటారు. అధ్యక్షుడిగా ఉన్నంతమాత్రాన వ్యాపారాలు చేయకూడదని చట్టం లేకపోయినా.. పూర్తిగా అధ్యక్ష బాధ్యతలపైనే దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను"అని ట్రంప్ ట్వీట్ చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా ఏవీ ఉండవని ఆయన చెప్పారు. వ్యాపార విషయాలు - తన కేబినెట్ తోపాటు ఇతర వివరాలు వెల్లడించడానికి త్వరలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కూడా ట్రంప్ తెలిపారు.
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అనూహ్యమైన ప్రకటన చేశారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఏ సమయంలోనైనా కలుసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. ట్రంప్‌తో సమావేశం ఎప్పుడు ఉండొచ్చు అని జర్నలిస్ట్‌లు అడగగా.. "ఎప్పుడైనా సిద్ధమే.. మా తరఫున ఎలాంటి సమస్యా లేదు" అని పుతిన్ స్పష్టంచేశారు. "రష్యా-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థాయికి రావాలని ట్రంప్ పబ్లిగ్గానే చెబుతున్నారు. దీనికి మేము మద్దతు పలకడం తప్ప మరో దారి లేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న ఈ పరిస్థితుల్లో అది అంత సులువు కాదని తెలిసినా.. మా ప్రయత్నం మేం చేస్తాం" అని పుతిన్ స్పష్టంచేశారు. అయితే ట్రంప్ తో సమావేశం ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/