జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమయంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై ఇటీవల బీజేపీ కార్యకర్తలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లిలో మంత్రి వాహనంలో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఈ దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ తాజాగా స్పందించారు. బాచుపల్లి మెడికల్ కళాశాలకు వెళుతుండగా బీజేపీ కార్యకర్తలు తనను చంపడానికి ప్రయత్నించారని.. తన కాన్వాయ్ పై దాడి చేశారని మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు.
బీజేపీ నేతలు చెబుతున్నట్టుగా కారులో డబ్బులు పెట్టి పంచడానికి తాను వెర్రి పువ్వును కాదని పువ్వాడ అజయ్ మండిపడ్డారు. బీజేపీ తనపై చేసిన దాడిని సీపీఐ నేత, చికెన్ నారాయణ సమర్థిస్తున్నారా? అని పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కమ్యూనిస్టు బిడ్డనేని .. ఇటువంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
కాగా బీజేపీ నేత దాడి ఘటనపై నారాయణ స్పందించారు. ఓ కార్యకర్త వాహనం పై నుండి కింద పడి పోయిన ఘటనను సిపిఐ నేత నారాయణ ఖండించారు. వాహనం నుండి కింద పడిపోయిన కార్యకర్త చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.