పేరుకు మనుషులే కానీ.. మానవత్వమన్నది ఒకటి ఉందన్న విషయాన్ని మర్చిపోతున్న దుర్మార్గులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం.. కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలన్న ఇంగితం మరిచి.. జంతువుల కంటే హీనంగా వ్యవహరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చినప్పుడు నోట మాట రాని పరిస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా మహిళాదినోత్సవం జరుపుకుంటున్న వేళ.. యూపీలో జరిగిన ఘోరం తెలిస్తే నోట వెంట మాట రాదు. రాయ్ పూర్ కి చెందిన 28 ఏళ్ల యువతి తన ఇద్దరు పిల్లలతో కలిసి సోదరి ఇంటికి వెళ్లేందుకు మంగళవారం రాత్రి బస్సు ఎక్కింది. ఆమె బస్సులోనే నిద్ర పోయింది. బస్టాప్ లో మిగిలిన ప్రయాణికులు దిగిపోగా.. ఆమె గాఢ నిద్రలో ఇదేమీ గుర్తించలేదు.
బస్సులో ఒంటరిగా ఉన్న ఆమెపై బస్సు డ్రైవర్.. కండెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలింత తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఆమె తన 14 రోజుల పసికందును కోల్పోయింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్.. కండెక్టర్ ఆమెను రోడ్డు మీద వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం నిందితులకోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నారు. పచ్చి బాలింత మీద ఇంతటి దారుణానికి పాల్పడటానికి ఆ దుర్మార్గులకు మనసు ఎలా ఒప్పిందో..?