భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ గాయని రబి పిర్జాదా గుర్తుంది కదూ? ఆర్జీవీలా వివాదాలు.. నోటిదురుసు ఆవిడ ప్రత్యేకత. 'మోదీ హిట్లర్.. ఐ జస్ట్ విష్ హా..!' అంటూ చాలానే చేసింది. కశ్మీర్ సమస్య.. ఆర్టికల్ 370 రద్దు తదితర విషయాలపై ఈ అమ్మడు చాలా ఘాటుగానే స్పందించింది. ప్రధాని మోదీపై వ్యంగ్యంగా వెటకారంగా పలు వీడియోల్ని పోస్ట్ చేసింది. పాములు.. మొసళ్లను తెచ్చుకుని వాటితో వీడియోల్ని రూపొందించి అవి మోదీకి చూపిస్తూ .. ఇవన్నీ నీకు కానుకలు.. నా ఫ్రెండ్స్ నీతో పండగ చేసుకుంటాయి!! అంటూ ఆ వీడియోలకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆవిడ గారి వెకిలి చేష్టలు చూసిన వన్యమృగ( వైల్డ్ లైఫ్) సంరక్షణ అధికారులు తనపై ఫైన్ వేశారు. అయితే ఇవేవీ నా సొంతవి కావు. అద్దెకు తెచ్చుకున్నా! అంటూ మరో వెకిలి మాటను మాట్లాడి బుక్కయ్యింది. నేను గత ఐదేళ్లుగా ఇలాంటివి ఎన్నో చేస్తున్నా. అయితే అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మోదీతో పెట్టుకున్నందుకే నాకు హెచ్చరికలు జారీ అయ్యాయా? అంటూ ఎటాకింగ్ కి దిగింది.
తాజాగా ఈ గాయని మరో ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 'నేను ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమ నుంచి బయటకు వెళ్లిపోతున్నా. అల్లా నన్ను క్షమించాలి. నేను చేసిన తప్పుల నుంచి రక్షించాలి. నా మంచి కోరేవాళ్లందరి గుండెలు చల్లబడాలి' అని అంది. అందుకు కారణమేంటి? అంటే.. ఇంతకుముందు రబి ఫిర్జదాకు సంబంధించిన ప్రయివేట్ ఫోటోలు సోషల్ మీడియాల్లో లీకవ్వడంతో అది కాస్తా సంచలనమైంది. దానిపై రబి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫిర్యాదు చేసింది. ఇదే కాకుండా తనపై నెటిజనులు నిరంతరం ట్రోల్స్ చేస్తూ వెంటాడుతున్నాడు. ఇలాంటి రకరకాల కారణాల వల్ల పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నానని ఇకపై గాయనిగా కొనసాగలేనని ప్రకటించింది.
ఇంతకీ సదరు గాయనీమణి కేవలం ప్రయివేటు ఫోటోలు లీకయ్యాయనే ఇంత పని చేస్తోందా? ఇలా చేస్తే మళ్లీ అలాంటి పోటోలు లీకవ్వవని గ్యారెంటీ ఏమిటి? ముందు ఆవిడ వదిలేయాల్సింది వృత్తిని కాదు చెడు ప్రవృత్తిని అంటూ మోదీ అభిమానులు చీవాట్లు పెడుతున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న పెద్దలతో వ్యవహరించే తీరు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి పాక్ గాయని ఈ మాటలు వింటుందా?