దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టుగా మారింది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పరిస్థితి. రాజద్రోహం ఆరోపణలతో అరెస్ట్ అయిన ఎంపీ రఘురామకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అయినా ఇప్పట్లో రఘురామ కష్టాలు తీరేలా లేవు.
సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా మరో రెండు రోజుల పాటు రఘురామ సీఐడీ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న రఘురామ ఇంకా సీఐడీ కస్టడీలోనే ఉన్నారు.
సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఆ తీర్పు కాపీ మాత్రం ఇంకా సీఐడీకి కానీ.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి కానీ, జైలు అధికారులకు కానీ అందలేదు. రఘురామ దురదృష్టం ఏంటంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం కావడంతో కోర్టులు పనిచేయవు. అలాగే తీర్పు కాపీలు పిటీషనర్లకు అందించేందుకు వీలు కాదు.
దీంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా సోమవారమే రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది. పైగా ఇద్దరు వ్యక్తులు, లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాల్సి ఉండడంతో రఘురామ విడుదల మరింత జాప్యం కానుంది.పోలీసులకు తీర్పు కాపీ అందాక ఆయన విడుదలకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో సోమవారం వరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.