సీటుకు ఎసరు రాకుండా రఘురామ లేఖల రాజకీయం

Update: 2021-06-25 15:50 GMT
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు వ్యవహారం ఢిల్లీ వర్గాల్లో హాట్ హాట్ గా మారింది. తన అనర్హత అసలు ఇష్యూనే కాదని లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీ రెబల్ ఎంపీ రఘురామ తాజాగా లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఎంపీ రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేయడం.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడం జరిగింది. ఇప్పటికీ స్పీకర్ స్పందించడం లేదు. రఘురామపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. తాజాగా విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీనికి రఘురామ కౌంటర్ లేఖ రాశారు.

 తన ఎంపీ సీటుకు ఎసరు వస్తున్న నేపథ్యంలో ఎంపీ రఘురామ అలెర్ట్ అయ్యారు. స్పీకర్ కు లేఖల పరంపరం కొనసాగిస్తున్నారు. తాజాగా లోక్ సభ స్పీకర్ కు వైసీపీ లేఖ రాసింది. దానికి రఘురామకృష్ణంరాజు స్పందించారు. కౌంటర్ గా తను స్పీకర్ కు లేఖ రాశారు. తాను చేసిన తప్పేంటని అడిగారు. ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా నడుచుకోలేదని స్పష్టం చేశారు.

ఇటీవలే ఎంపీ విజయసాయిరెడ్డి లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఎంపీ రఘురామపై అనర్హత వేటును వెంటనే వేయాలని.. ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని లేఖలో కోరారు. దీనికి ఎంపీ రఘురామ వివరణ ఇచ్చారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదును పట్టించుకోవద్దని కోరారు. పార్టీ క్రమశిక్షణను తాను ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని మాత్రమే సూచించానన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని లేఖలో పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అసమ్మతి కాదన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులను రఘురామ ఉంటకించడం విశేషం.

ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయించి ఆయన ఎంపీ సీటును పోగొట్టాలని వైసీపీ చేయని ప్రయత్నం లేదు. స్వయంగా సీఎం జగన్ సైతం ఈ విషయంలో ఒత్తిడి తెచ్చినా ఢిల్లీలో సాధ్యం కావడం లేదన్న గుసగుసలున్నాయి. అనర్హత పిటీషన్ వైసీపీ అధిష్టానం లోక్ సభ స్పీకర్ కు ఇచ్చి ఇప్పటికే 11 నెలలు అవుతోంది. అయినా కూడా స్పీకర్ చర్య తీసుకోకపోవడంపై వైసీపీ గుర్రుగా ఉంది. వైసీపీ ఎంపీల లేఖలు.. దానికి రఘురామ ప్రతిస్పందన లేఖలతో రాజకీయం వేడెక్కుతోంది.
Tags:    

Similar News