ఎలా ఉండే రఘువీరా.. ఎలా అయ్యాడు?

Update: 2019-12-29 09:35 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎన్నో దశాబ్ధాలు ఏలిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ చీఫ్ పదవి అంటే కొట్టుకు చచ్చేవారు నేతలు.. కానీ.. నేడు.. ఏంటి దుస్థితి. ఏపీ విడిపోయాక విభాజిత నవ్యాంధ్రలో కాంగ్రెస్ దాదాపు చచ్చిపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత అంతో ఇంతో పైకి లేపుదామని వైఎస్ హయాంలో మంత్రిగా కీలక పాత్ర పోషించిన రఘువీరారెడ్డి ప్రయత్నించారు.

మొన్నటి ఎన్నికల వేళ ఏపీ పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి చాలానే ప్రయత్నాలు చేశారు. ఈయనే కాదు కాంగ్రెస్ దిగ్గజ పాత నేతలంతా శాయశక్తుల ప్రయత్నించారు. కానీ ఒక్కరూ గెలవలేకపోయారు.

అనాదిగా కాంగ్రెస్ ను నమ్ముకొని ఎదిగిన వీరు ఇప్పుడు కాంగ్రెస్ ను వీడలేక.. వేరే పార్టీలోకి వెళ్లలేక కాంగ్రెస్ కే సెలవు తీసుకున్నారు. కాలం కలిసి రాకపోవడంతో ఏపీ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రాజకీయాలకు సెలవు ప్రకటించారు.

అనంతపురం జిల్లాలోని తన సొంతూరు నీలకంఠాపురం స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేస్తున్నారు. ఉదయం 5 గంటలకే నిద్రలేచి పొలం బాట పట్టి పొలం దున్ని రాత్రికి ఇంటి వస్తూ తననుతానే బీజీగా చేసుకొని రాజకీయాలకు దూరమయ్యారు. వైఎస్ హయాంలో వెలుగు వెలిగిన రఘువీరా ఇలా వ్యవసాయం చేసుకుంటూ మాసినగడ్డం.. తెల్లటి దోవతితో అచ్చం రైతులా కళావిహీనంగా కనిపించిన దృశ్యం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో వైరల్ గా మారింది.

Full View
Tags:    

Similar News