గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించి ఏపీ అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి కొనసాగుతున్న మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి నిజంగానే టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని మించిపోయారు. తాను చేస్తే సంసారం - ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రఘువీరా కూడా ఇదే బాటలోకి వచ్చేశారు. తాము చేస్తే సంసారం - ఇతరులు చేస్తే వ్యభిచారం అని రఘువీరా చెప్పకనే చెప్పేస్తున్నారు. ఈ తరహా వైఖరితో ఇప్పుడు ఈ విద్యలో ఆరితేరిన చంద్రబాబుకే రఘువీరా గురువుగా మారిపోయారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ కథాకమామీషు ఏమిటో చూద్దాం పదండి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కాంగ్రస్ పార్టీతో కలిసి టీడీపీ జట్టుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోందని మొన్నటిదాకా అంతా అనుకున్నారు. అయితే బాబు కారణంగా తెలంగాణలో తగిలిన దెబ్బ ఇంకా కనుమరుగు కాని నేపథ్యంలో బాబుతో పొత్తు లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా రఘువీరారెడ్డే మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు. అంతకుముందు... టీడీపీతో కలిసి వెళితేనే ఏపీలో తమ పరిస్థితి బాగుంటుందన్న కోణంలోనూ రఘువీరా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పొత్తు లేదని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చేయడంతో రఘువీరా కూడా సోలో ఫైటే అంటున్నారు. అయితే టీడీపీతో పొత్తుతో వెళితే తమ భవిష్యత్తు కాస్త బాగుపడుతుందని భావిస్తున్న నేతలు ఏపీ కాంగ్రెస్ లో చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పొత్తు లేదని తేలడంతో... ఏకంగా కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలోకి జంప్ అయ్యే నేతలు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు.
అలాంటి నేతల్లో కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఒకరు. నేటి రాత్రి టీడీపీ అదినేత - ఏపీ సీఎంతో విందు భేటీలో పాలుపంచుకున్న కోట్ల.. టీడీపీలోకి జంప్ అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన వార్త తెలిసిన వెంటనే రఘువీరాలోని చంద్రబాబు తరహా మనిషి ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. కోట్ల టీడీపీలోకి ఎలా చేరతారంటూ పెడబొబ్బలు పెట్టేశారు. అసలు కోట్ల టీడీపీలోకి ఎలా చేరతారంటూ ఆయన నానా యాగీ చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం దురదృష్టకరంగా అభివర్ణించిన రఘువీరా... ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీలో కోట్ల ఇమడటం చాలా కష్టమని చెప్పారు. అంతటితో ఆగని రఘువీరా.. కోట్ల టీడీపీలో చేరితే విజయభాస్కర రెడ్డి ఆత్మక్షోభిస్తుందని తనదైన శైలి కామెంట్ చేశారు. మరి అదే ప్రాంతీయ పార్టీతో కాంగ్రెస్ పార్టీ హోల్ అండ్ సోల్ గా పొత్తు పెట్టుకున్నప్పుడు ఎవరి ఆత్మ క్షోభించిందో కూడా రఘువీరా చెప్పి ఉంటే బాగుండేదేమో. మొత్తంగా తాను చేస్తే సంసారం - ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా వ్వవహరించిన రఘువీరా... ఈ తరహా వైఖరికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బాబుకు నిజంగానే గురువుగా మారిపోయారన్న వాదన వినిపిస్తోంది.