టీఆర్ఎస్‌ తో దోస్తీపై రాహుల్ క్లారిటీ చ‌ప్ప‌ట్ల‌తో జోష్‌

Update: 2022-05-06 15:35 GMT
వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన‌ రైతు సంఘర్షణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగా ప్ర‌సంగించార‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల రాలేదని, ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్న రాహుల్ గాంధీ ఇందులో త‌మ కృషిని వెల్ల‌డించారు. తెలంగాణ ప్రజల స్పప్నం నెర‌వేర్చిన‌ప్ప‌టికీ తెలంగాణ వల్ల బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అంత సులువైన పని కాదని, కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్నారు. ఇలా ప్ర‌త్యేక రాష్ట్రం గ‌తం గురించి చెప్ప‌డ‌మే కాకుండా భ‌విష్య‌త్తు గురించి క్లారిటీ ఇచ్చారు.

టీఆర్ఎస్ పార్టీతో పొత్తుల గురించి ఏ నేత అడిగినా వారిని పార్టీ నుంచి తొల‌గిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ‌ను ఒక వ్య‌క్తి, ఆయ‌న కుటుంబం దోచుకుంటుంద‌ని ప‌రోక్షంగా ప‌రిపాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌ను మోసం చేసి వ్య‌క్తితో పొత్తుండ‌దని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. భ‌విష్య‌త్తులో కూడా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ పార్టీతో జ‌ట్టు క‌ట్టేది లేదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌తో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోందని ఈ మేర‌కు ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు.  త‌ద్వారా తెల‌గాణ‌లో పొత్తులు, కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో టీఆర్ఎస్ క‌ల‌వ‌బోతుందా అని చ‌ర్చ‌ల‌కు చెక్ పెడుతూ పొత్తుల అవ‌కాశ‌మే ఉండ‌ద‌ని ఆయ‌న వివ‌రించారు.

తెలంగాణలో నా అవ‌స‌రం ఎప్పుడున్నా, ఎక్క‌డున్నా నేను వ‌చ్చేందుకు రెడీ రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కుల‌కే టికెట్లు ఇస్తామ‌ని, ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చే వారికి అవ‌కాశం క‌ల్పించ‌బోమ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. ప్ర‌జ‌ల్లో ఎవ‌రెంత ఎక్కువ‌గాఉంటే అంత మేర‌కు వారికి టిఎక్ ద‌క్క‌డానికి అవ‌కాశాలు విస్తృతం అవుతాయ‌ని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. త‌ద్వారా జంప్ జిలానీలు ఆశ‌లు పెట్టుకోవ‌ద్ద‌న్న మాట‌ను ఆయ‌న తేల్చిచెప్పారు. మ‌రోవైపు, తెలంగాణ‌లో  తేల్చుకుంటామ‌ని రాహుల్ ఈ స‌మావేశం ద్వారా చెప్పార‌ని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా రాహుల్ గాంధీ కామెంట్ చేసిన‌ప్పుడు స‌భ‌కు విచ్చేసిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చ‌ప్ప‌ట్ల‌తో సంఘీభావం తెల‌ప‌డం క‌నిపించింది.
Tags:    

Similar News